చారిత్రక పరిశోధకుడు ‘మల్లాది’
మల్లాది లీలా కృష్ణమూర్తి… చారిత్రక పరిశోధకుడు, విద్యావేత్త. ఆయన ఇండియన్ సొసైటీ ఫర్ ప్రి హిస్టారిక్, క్వటార్నరీ స్టడీస్‌లో సభ్యులు. ఆయన 1990 నుండి ఇండో పసిఫిక్ ప్రీ హిస్టారిక్ అసోసియేషన్‌కు సభ్యులుగా ఉన్నారు. ఆయన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి విశ్రాంత ఆచార్యులు. ఆయన మార్చి 12 1941న గుంటూరు జిల్లాలో మల్లాది మల్లిఖార్జునశాస్త్రి, హైమావతి దంప్తతులకు జన్మిచారు. 1962లో బరోడాలోని మాస్టర్ ఆఫ్ సైన్స్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ చేసారు. 1967లో పూణెలోని పూణె విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రంలో డాక్టరేట్ పట్టాను పొందారు. ఆయన 1970-1985 మధ్య పూణెలోని పూణె విశ్వవిద్యాలయంలోని ఆర్కియాలజీ విభాగంలో అధ్యాపకునిగా పనిచేసారు.
సౌత్ ఆసియన్ ఆర్కియాలజీ దక్కన్ కళాశాల యందు రీడరుగా 1985-1988లలో పనిచేసారు. 1988లో శ్రీశైలంలోని చరిత, సంస్కృతి తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగానూ, 1988 నుండి రీజనల్ స్టడీస్ హైదరాబాదులో ప్రొఫెసరు, విభాగాధిపతి గానూ పనిచేసారు. 1990 నుండి సౌత్ ఆసియా ఇనిస్టిట్యూట్ యూనివర్శిటీ హైడల్‌బర్గ్, జర్ననీకి అతిధి అధ్యాపకునిగా ఉన్నారు. అతనికి మైక్రోబయాలజీ అంటే అప్పట్లో ఇష్టంగా ఉండేది. అందుకోసం బరోడా, మహరాజా సయాజీ విశ్వవిద్యాలయానికి వెళ్లి అనుకోకుండా పురావస్తు శాస్త్రంలో చేరారు. సుప్రసిద్ధ పురావస్తు శాస్త్రవేత్త ఆచార్య బెండపూడి సుబ్బారావు ఆయన గురువు. మూర్తి 1965 ప్రాంతంలో పరిశోధన కొనసాగించడానికి పూనా దక్కన కళాశాలలో చేరేరు. అక్కడ సుప్రసిద్ధ పురావస్తు శాస్త్రవేత్త హెచ్.డి. సాంకరియా ఆయనకి గురువు. మూర్తి దక్కన కళాశాలలో చాలాకాలం పనిచేశారు.
అక్కడ ఉన్నప్పుడే ఆయన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో విలక్షణమైన పరిశోధనలు చేశారు. చిత్తూరు జిల్లా రాళ్ల కాలువ వెంట ఉదయం నుంచీ సాయంకాలం వరకూ నడిచేవారు. ఆ పరిశోధన విశేషాలే మూర్తిగారు వరల్డ్ ఆర్కియాలజీలో వ్యాసరూపంలో ప్రకటించారు. అంతర్జాతీయంగా ఆయన పేరు ప్రతిష్ఠలకి మొదటి మెట్టు అది. బేతంచర్ల, బిల్లసర్గం గుహల్లో శిలాయుగ మానవ ఆవాసాలను గుర్తించి గొప్ప పరిశోధక వ్యాసాలు ప్రచురించాడతను. ఆంధ్ర తెలంగాణలలో ఆయన చేసిన పరిశోధనల్లో ముఖ్యవిశేషం, ప్రాచీన శిలాయుగపు కాలనిర్ణయం చేసే క్రమంలో అప్పటికే బెండపూడి సుబ్బారావు, సాంకరియా వంటి పరిశోధకులు ఒక స్థూల సాంస్కృతి స్తలాలను గుర్తించడం.
అరవై దశకంలో ప్రాచీన శిలాయుగాన్ని ఉపశిలా యుగ సంస్కృతులుగా ఉపవిభజన జరిగింది. ఈ ఉపవిభజన స్థానిక, ప్రాదేశిక సామీప్యాన్ని బట్టి క్రమపరిణామాన్ని అనుసరించి స్థూలంగా ఇతర తవ్వకాలలో సరిపోల్చుకుంటూ చేసిన విభజనలు. మూర్తిగారు మధ్యశిలాయుగానికి చెందిన సూక్ష్మ శిలా పరికరాల సాయంతో ఉప విభజనల ప్రత్యేకతని వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన ముచట్ల చింతమానుగావి గుహల పరిశోధకులు. ఇక్కడ మూర్తి ఖచ్చితమైన మధ్యశిలాయుగపు క్రమపరిణామాన్ని స్పష్టంగా ధృవీకరించారు. దీన్ని వెలుగులోకి తీసుకురావడం మూర్తి ఘనత. 1974 నాటికి అంతర్జాతీయ పురావస్తు సంచికలలో దీని గురించి ఆయన వ్యాసాలు ప్రచురించారు. ఆయన లెక్కలేనన్ని అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలు సమర్పించాడు. దేశవిదేశాల్లో విస్తృతంగా పర్యటించాడు.
చింత మానుగావిలో ప్రాచీనావాసాలను పరిశీలించేటప్పుడు మూర్తి జర్మన మిత్రుడు, ప్రాచీన హిందూ న్యాయస్మృతిలో పండితుడు సాంతహైమర్ యథాలాపంగా చేసిన సూచనతో మూర్తి జానపద గిరిజన సంస్కృతుల అధ్యయనంలో ప్రవేశించారు. కొన్నేళ్ళ తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జానపద పరిశోధనా సంస్థకి డైరెక్టర్లుగా వెళ్లి ఆంధ్ర దేశంలో స్థిరపడ్డాడు. ఇటువంటి మల్టీ డిసిప్లినరీ పరిశోధకుల్లో అరుదైన వ్యక్తి ఆయన. ఆయన నాలుగు పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో గౌరవాచార్యులుగా ఉండేవారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆయన దగ్గర పరిశోధన చెయ్యడానికి విద్యార్థులలో ఒకరకమైన పోటీ ఉండేది. 2003లో మొదటి సంపుటి , పూర్వయుగం నుండి క్రీ పూ500 వరకు ఎమ్ఎల్కె మూర్తి సంపాదకత్వంలో విడుదలైంది. మల్లాది లీలా కృష్ణమూర్తి స్వస్థలం బాపట్ల. అతనికి మైక్రోబయాలజీ అంటే అప్పట్లో ఇష్టంగా ఉండేది.
అందుకోసం బరోడా, మహరాజా సయాజీ విశ్వవిద్యాలయానికి వెళ్లి అనుకోకుండా పురావస్తు శాస్త్రంలో చేరేడు. సుప్రసిద్ధ పురావస్తు శాస్త్రవేత్త ఆచార్య బెండపూడి సుబ్బారావు గారు ఆయన గురువు. సుబ్బారావు గారి గురుత్వం, సాహచర్యం మూర్తిగారి వ్యక్తిత్వాన్ని గాఢంగా ప్రభావితం చేశాయి. సుబ్బారావు గారు విజయవాడ వస్తూ ఆకస్మికంగా రైల్లో మరణించారు. పురావస్తు పరిశోధన గొప్ప పరిశోధకాచార్యుణ్ని పోగొట్టుకుంది. మూర్తి 1965 ప్రాంతంలో పరిశోధన కొనసాగించడానికి పూనా దక్కన కళాశాలలో చేరేరు. అక్కడ సుప్రసిద్ధ పురావస్తు శాస్త్రవేత్త హెచ.డి. సాంకరియా ఆయనకి గురువు. మూర్తిగారంటే ఆయనకి అభిమానం, నమ్మకం. నేను 1967లో పరిశోధక విద్యార్థిగా దక్కన కాలేజీ చేరుకున్నాను. నాకంటే కొంచెం పెద్దవాడు మూర్తిగారు. గాఢ స్నేహం ఏర్పడింది. మూర్తి శ్రీమతి లక్ష్మి కూడా శాస్త్రవేత్తల కుటుంబానికి చెందినవారు.
ఆనాటి దక్కన కాలేజీ ప్రాచీన వారణాసి వలె ఉండేది. భాషాశాస్త్రంలో, పురావస్తు శాస్త్రంలో ప్రపంచం నలుమూలల నుంచీ పరిశోధకులు వస్తూండేవారు. అవిగాక సామాజిక శాస్త్రం, ఫ్రెంచి, అమెరికన సంస్థలు కూడా అక్కడే ఉండేవి. దక్కన కళాశాల మాకు ప్రత్యేక ప్రాణవాయువు ప్రసాదించి చైతన్యవంతుల్ని చేసింది. మూర్తి దక్కన కళాశాలలో చాలాకాలం పనిచేశారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో విలక్షణమైన పరిశోధనలు చేశారు. తరువాత నేను బతుకుతెరువు కోసం ఒంగోలు చేరుకున్నాను. అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఆయన క్షేత్ర పర్యటనలు చేస్తున్నప్పుడు వెంట ఉన్నాను. చిత్తూరు జిల్లా రాళ్ల కాలువ వెంట ఉదయం నుంచీ సాయంకాలం వరకూ నడిచేవాళ్లం. ఆ పరిశోధన విశేషాలే మూర్తిగారు వరల్డ్ ఆర్కియాలజీలో వ్యాసరూపంలో ప్రకటించారు. అంతర్జాతీయంగా ఆయన పేరు ప్రతిష్ఠలకి మొదటి మెట్టు అది. బేతంచర్ల, బిల్లసర్గం గుహల్లో శిలాయుగ మానవ ఆవాసాలను గుర్తించి గొప్ప పరిశోధక వ్యాసాలు ప్రచురించాడతను.
ఆంధ్ర తెలంగాణలలో ఆయన చేసిన పరిశోధనల్లో ముఖ్యవిశేషం, ప్రాచీన శిలాయుగపు కాలనిర్ణయం చేసే క్రమంలో అప్పటికే బెండపూడి సుబ్బారావు గారు, సాంకరియా వంటి పరిశోధకులు ఒక స్థూల సాంస్కృతి స్తలాలను గుర్తించడం. అరవై దశకంలో ప్రాచీన శిలాయుగాన్ని ఉపశిలా యుగ సంస్కృతులుగా ఉపవిభజన జరిగింది. ఈ ఉపవిభజన స్థానిక, ప్రాదేశిక సామీప్యాన్ని బట్టి క్రమపరిణామాన్ని అనుసరించి స్థూలంగా ఇతర తవ్వకాలలో సరిపోల్చుకుంటూ చేసిన విభజనలు. మూర్తిగారు మధ్యశిలాయుగానికి చెందిన సూక్ష్మ శిలా పరికరాల సాయంతో ఉప విభజనల ప్రత్యేకతని వెలుగులోకి తీసుకొచ్చారు. ముచట్ల చింతమానుగావి గుహల పరిశీలన మూర్తిగారి పరిశోధనా జీవితంలో ఒక పెద్ద మలుపు. ఆ గుహలు ప్రాచీన శిలాయుగపు రెండో దశ నుంచి దక్షిణ దేశపు నవీన శిలా యుగం వరకూ వేట, ఆహార సముపార్జన చేసుకునే అనేకతరాల మానవుల ఆవాస కేంద్రాలు. ఇక్కడ మూర్తిగారు ఖచ్చితమైన మధ్యశిలాయుగపు క్రమపరిణామాన్ని స్పష్టంగా ధృవీకరించడం విశేషం.
ఇంత సుదీర్ఘమైన, అంటే ప్రాచీన శిలాయుగం నుంచి నవీన శిలాయుగం వరకూ కొనసాగిన మానవ ఆవాస క్రమం ఒకేచోట కనిపించడం అపూర్వం. దీన్ని వెలుగులోకి తీసుకురావడం మూర్తి ఘనత. 1974 నాటికి అంతర్జాతీయ పురావస్తు సంచికలలో దీని గురించి ఆయన వ్యాసాలు ప్రచురించారు. స్పష్టంగా ఆ గుహలలో భిన్న కాలాలకు చెందిన శిలా పరికరాలు, జంతు, వృక్ష అవశేషాలు గుర్తించారాయన. మూర్తి గారి పరిశోధన ఇక్కడే మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ఈ ప్రాచీన జీవన విశేషాలను అతను ప్రాంతీయ ఆదిమ జాతులైన చెంచు, యానాది, ఎరుకల, బోయల జీవికా నిర్వహణ పద్ధతుల్లో ఒక కొనసాగింపును గమనించారు. ఈ నూతన దృష్టి పురావస్తు, మానవశాస్త్ర క్షేత్ర పరిశోధనల మీద గాఢమైన ముద్ర వేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఆచార్య ఎమ్.ఎల్.కే. మూర్తి గారి ప్రతిష్ఠ పెరుగుతూ వచ్చింది.
లెక్కలేనన్ని అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలు సమర్పించాడు. దేశవిదేశాల్లో విస్తృతంగా పర్యటించాడు. ప్రపంచ ప్రసిద్ధులైన అనేక మంది పురావస్తు శాస్త్రజ్ఞులు, జానపద విజ్ఞాన వేత్తలతో ఏర్పడ్డ స్నేహం ఆయన్ని వ్యక్తిగా, పరిశోధకుడిగా ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. చింత మానుగావిలో ప్రాచీనావాసాలను పరిశీలించేటప్పుడు మూర్తి గారి జర్మన మిత్రుడు, ప్రాచీన హిందూ న్యాయస్మృతిలో పండితుడు సాంతహైమర్ యథాలాపంగా చేసిన సూచనతో మూర్తిగారు జానపద గిరిజన సంస్కృతుల అధ్యయనంలో ప్రవేశించారు. కొన్నేళ్ళ తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జానపద పరిశోధనా సంస్థకి డైరెక్టర్లుగా వెళ్లి ఆంధ్ర దేశంలో స్థిరపడ్డాడు. ఇటువంటి మల్టీ డిసిప్లినరీ పరిశోధకుల్లో అరుదైన వ్యక్తి ఆయన. మన దేశంలో ఉన్న అన్ని గిరిజన ప్రాంతాల్నీ పరిశీలించారు మూర్తిగారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఇద్దరం రెండుసార్లు పర్యటించాం. జానపద, గిరిజన సంస్కృతుల్ని అనేక మంది అధ్యయనం చేశారు.
కానీ మూర్తిగారి వలె సృజనాత్మక విశ్లేషణ ఎవరూ చెయ్యలేదు. ఆదివాసుల జీవన విధానం, వారి గాధలు, మౌఖిక సాహిత్యం పరిశీలించి వాటి నిర్మాణం, అందులోని ప్రతీకల్ని వెలికి తీశాడాయన. గిరిజనులు విగ్రహారాధకులు కారు. కానీ చారిత్రక యుగాల్లో అనేక గిరిజన జాతులు విగ్రహాల్ని కొలవడం, జాతరలు చెయ్యడం వంటి కొత్త ఆచారాలను అలవరుచుకున్నారు. దీనిక్కారణం వ్యవసాయవిస్తరణ అడవుల వరకూ వ్యాపించడం, రాజ్యవిస్తరణ జరగడం. రెండు భిన్నమైన జీవావరణ వ్యవస్థలు, సాంస్కృతిక సీమలు ఘర్షణ కేంద్రాలైనాయి. దీని గురించి మూర్తి గొప్ప వ్యాసం రాశారు. ఈ ఘర్షణ సమసి ఆదానప్రదానాలు జరిగేయి. దీనివల్లనే భిన్న సంస్కృతులకి ఒక నూతన అభివ్యక్తి ఏర్పడుతుంది.
గిరిజనులు ఈ కారణంగానే విగ్రహాల్ని కొలవడంతో పాటు, వారి దేవతల ద్వారా, గాథల ద్వారా, కథల ద్వారా ఆదానప్రదానాలను అద్భుతంగా వ్యక్తీకరించారు. అంటే ఒకే జీవావరణ వ్యవస్థ మీద భిన్న జాతుల వారు జీవికా నిర్వహణ కోసం ఆధారపడినప్పుడు ఏర్పడే సాంస్కృతిక సమ్మేళనం అత్యంత సృజనాత్మకంగా గాథల రూపంలో వ్యక్తం అవుతుంది. అటవీ ప్రాంతాలకు రాజ్యవిస్తరణ జరిగినప్పుడు సరిహద్దుల్లో ప్రతీకాత్మకంగా నృసింహాలయాలు నిర్మించారు. గిరిజన జానపద గాథల్ని ఈ దృష్టితో చూడ్డం మూర్తి దగ్గర నేర్చుకున్నాను. దీనికి నేను ఈకో మెథాలజీ అని పేరు పెట్టుకున్నాను. ఈ రకమైన నూతన వ్యాఖ్యానానికి ఆచార్య మూర్తి ఆద్యుడు.
నాలుగు పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో మూర్తి గారు గౌరవాచార్యులుగా ఉండేవారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆయన దగ్గర పరిశోధన చెయ్యడానికి విద్యార్థులలో ఒకరకమైన పోటీ ఉండేది. ఆచార్య ఎమ్.ఎల్.కే. మూర్తి గురించి ఆంధ్ర దేశంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో తెలియదనుకుంటాను. ఆయన ఆంగ్ల వ్యాసాలన్నీ ఒక సంపుటిగా రావాలి. ఆయన పరిశోధక విద్యార్థులు, ఇతరులూ కలిసి మంచి పరిశోధనా వ్యాసాల సంకలనాన్ని ఆయనకి గౌరవ స్మృతిగా తీసుకురావాలి. ఇది జరుగుతుందని ఆశిస్తున్నాను. మా శశి ఆయన ఆంగ్ల వ్యాసాన్ని ఇదివరకే సంపాయించాడు. ఇందులో కొన్ని వివరాలు అట్లా వచ్చినవే. మూర్తి, మీరు నాకు ఎప్పుడూ ఎంతో ఇష్టంగా జ్ఞాపకం ఉంటారు. జీవితంలో నాకు లభించిన ఎంతో దురదృష్టంతో ఈ నివాళి రాయడం కూడా చేరిపోయింది.


