చిన్న శేష వాహనంపై ఊరేగిన మలయప్పస్వామి
- 78 Views
- wadminw
- October 4, 2016
- రాష్ట్రీయం
తిరుపతి, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రెండవ రోజు మంగళవారం ఉదయం చిన్న శేష వాహనంపై ఆయల మాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తకోటికి దర్శనభాగ్యం కల్పించారు. అంతకుముందు స్వామివారిని వేకువజామున సుప్రభాత సేవతో మేల్కోల్పి నిత్యకైంక్యరాలు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు వాహన మండపానికి వేంచేశారు.
స్వామి, అమ్మవార్లను చిన్న శేష వాహనంపై అధిష్టింప చేసి బంగారు, వజ్ర,వైడుర్య, మరత మాణిక్యాదులు, పట్టు పితంబరాలు, సుగంధ పరిమళ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. వాహన ముందు భాగాన అశ్వ,గజ వృషువాలు మందు సాగా పండితుల వేద గోష నడుమ వాహన సేవ ఆధ్యాంతం కొనసాగింది. వివిధ కళాకారుల నృత్య ప్రదర్శన, కోలాటాలు, భజనలు. కేరళ వాయుద్దాలు భక్తల నామస్మరణ నడుమ వాహన సేవా ఆధ్యాంతం కొనసాగింది. కాగా, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం మలయప్పస్వామి చిన్నశేషవాహనంపై వూరేగారు.
ఉదయం 9 నుంచి 11 గంటల వరకు తిరువీధుల్లో చిన్న శేషవాహనసేవ జరిగింది. వాహనసేవకు ముందు కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అశేష భక్తకోటి నుంచి స్వామివారు హారతులందుకున్నారు. వాహనసేవలో ఏపీ మంత్రి మాణిక్యాలరావు, తితిదే ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవోలు శ్రీనివాసరాజు, పొలా భాస్కర్, ఆలయ ముఖ్య భద్రతాధికారి శ్రీనివాసరావు, బోర్డు సభ్యులు, టీటీడీ అధికారులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా, తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్పస్వామికి చిన్నశేషవాహన సేవ ప్రారంభమైన కొద్దిసేపటికే తిరుమలలో చిరు జల్లులు మొదలయ్యాయి. దీంతో చిరుజల్లుల్లోనే ఘటాటోపం కింద తిరువీధుల్లో స్వామివారు విహరిస్తున్నారు. చిరు జల్లుల కారణంగా స్వామివారి వాహనసేవను వీక్షించేందుకు వచ్చిన భక్తులు కొంత అసౌకర్యానికి గురయ్యారు.
లక్ష్యం మేర రుణాలు మంజూరు: జేసీ
తిరుపతి, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల ద్వారా 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం నిరుద్యోగుల స్వయం ఉపాధి కోసం మంజూరు చేయనున్న రుణాల లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్-2 వెంకటసుబ్బారెడ్డి ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయం నుంచి ఆయన సంక్షేమ శాఖల అధికారులతో కలిసి ఎంపీడీఓలు, పురపాలక, నగరపాలక సంస్థ కమిషనర్లు, బ్యాంకర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. రాయితీ రుణాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 18వ తేదీ లోపు ఏపీఓబీఎంఎంఎస్ వెబ్సైట్ ద్వారా అంతర్జాలంలో దరఖాస్తులను రిజిస్టర్ చేసుకుని అప్లోడ్ చేయించాలని సూచించారు. ఎవరైనా ఆలస్యం చేస్తే ఆ మండలానికి కేటాయించిన లక్ష్యంలో మిగిలిన రుణాలను డిమాండు ఉన్న మండలాలు, పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలకు కేటాయించనున్నట్లు హెచ్చరించారు. సమావేశంలో మైనార్టీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఇన్‌ఛార్జి ఈడీ శ్రీనివాసకుమార్, బీసీ కార్పొరేషన్ ఇన్‌ఛార్జి ఈడీ రమేష్‌రెడ్డి, గిరిజన సంక్షేమశాఖాధికారి ఈశ్వర్రావు, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం భక్తులు తిరుమల కొండకు భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో ఉంది. దీంతో స్వదర్శనం కోసం భక్తులు 17 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. వీరికి దర్శన సమయం 6 గంటల్లోపు స్వామి దర్శనం కలుగుతోంది. 50 సుదర్శనం, 300 ఆన్లైన్ భక్తులకు 2 సమయంలో దర్శనం లభిస్తోంది. కాలిబాటన అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గంలో వచ్చే దివ్య దర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు 5 గంటల సమయంలో స్వామి దర్శనం కలుగుతోంది. సోమవారం ఉదయం 5 గంటల నుండి మంగళవారం 5 గంటల వరకు 52,467 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. కేంద్రీయ విచారణ కార్యాలయం, టీజీసీ, కౌస్తవం ఎంబీసీ 34, పద్మావతి అతిథి గృహం, సన్నిదానం, భక్తులకు గదులు అందుబాటులో ఉన్నాయి. కల్యాణకట్ట, నిత్యాన్నప్రసాద సముదాయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కాగా, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సోమవారం వేకువజాము నుండి రాత్రివరకు భక్తులు శ్రీవారిని దర్శించుకుని సమర్పించిన కానులను ఆలయంలోని పరకమణిలో లెక్కింపులు నిర్వహించారు. దీంతో శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలు లెక్కింపులు నిర్వహించగా ఈ మేరకు సుమారు రూ.2.55 కోట్ల్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు సమకూరినట్లు అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యే ప్రవేశదర్శనానికి 2గంటలు, కాలినడక భక్తులకు 5గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 52,467 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,105 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.2.55 కోట్లు.


