చిరంజీవికి మొగల్తూరులో సొంత ఇల్లు లేదు
- 88 Views
- admin
- October 21, 2022
- తాజా వార్తలు రాష్ట్రీయం
‘‘నిజానికి ‘మొగల్తూరు’లో చిరంజీవిగారికి ఎలాటి ఇల్లూ లేదని సీనియర్ జర్నలిస్టు ప్రభు తెలిపారు. మొగల్తూరులోని చిరంజీవి సొంత ఇంటిని అక్కడి గ్రామస్తులు గ్రంథాలయం కోసం ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా కేవలం 3 లక్షలకు దానిని ఆయన అమ్మేశారనే ఒక ప్రచారం ఉంది. దీనిపై తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడిరచారు. మొగల్తూరు అనేది చిరంజీవి పుట్టిన ఊరు మాత్రమే. వాళ్ల నాన్నగారు ఉద్యోగ రీత్యా అనేక ప్రాంతాలలో పనిచేస్తూ వచ్చారు. అలా తిరుగుతూ ఉండటం వలన వాళ్లకి ఒక స్థిరమైన ఇల్లు అనేది ఉండేది కాదు. మొగల్తూరులో ఉన్నది చిరంజీవిగారి తాతగారి ఇల్లు. చిరంజీవిగారు రాజకీయాల్లోకి రావడానికి పూర్వమే ఆ ఇంటిని వాళ్లు అమ్మేసుకోవడం జరిగింది. దాంతో చిరంజీవిగారికి ఎలాంటి సంబంధం లేదు’’ అని చెప్పారు. కొసమెరుపు ఏమిటంటే 1998 నాటికే చిరంజీవిగారి పేరు మీద మొగల్తూరులో గ్రంథాలయం ఉంది’’ అంటూ చెప్పుకొచ్చారు. మొగల్తూరులోని చిరంజీవి సొంత ఇంటిని అక్కడి గ్రామస్తులు గ్రంథాలయం కోసం ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా కేవలం 3 లక్షలకు దానిని ఆయన అమ్మేశారనే ఒక ప్రచారం ఆయన ప్రత్యర్థులు అప్పట్లో బాగా చేశారు.


