చివరిదశలో ‘సుడిగాలి’
- 70 Views
- wadminw
- January 8, 2017
- Home Slider సినిమా
సీనియర్ నటుల సినిమాలు తగ్గడంతో వర్ధమాన తరం హీరోల చిత్రాల వేగం పుంజుకున్నట్లు కనిపిస్తోంది. వెంకటేష్, మల్లేష్, ప్రాచి అధికారి, మమత కులకర్ణి హీరో హీరోయిన్లుగా శివ పార్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై చిట్టిపల్లి లక్ష్మి సమర్పణలో వస్తున్న చిత్రం ‘సుడిగాలి’. ఈ చిత్రం ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో శృంగారం చేయకూడదు అది ప్రకృతి విరుద్ధం.
ఆలా చేయడం వల్ల కోరికలు తీరక, చనిపోయిన మనిషి కోరికలు ఆత్మలుగా మారి సుడిగాలి రూపంలో అయినవారిని ఆవహించి నానా కష్టాలకు గురిచేస్తాయి అన్న కథానాంశాన్ని సందేశాత్మక కోణంలో ప్రేక్షకులకు అందించే ప్రయత్నంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ నాటి యువతరం చిన్న పిల్లలతో సహా మొబైల్స్‌లో అసభ్యకరమైన చిత్రాలు చూసి పెడదారి పడుతుంది. సృష్టి విరుద్ధమైన కార్యకలాపాలు నిషేధించాలి అనే అంశంతో సుడిగాలి చిత్రం రూపొందించామన్నారు. వచ్చే నెలలో పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసి ఆడియోను విడుదల చేయడంతో పాటు మార్చిలో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాతలు వెంకటేష్, మల్లేష్ బిరాదర్ తెలిపారు.


