చెప్పినట్లు వినకుంటే పరీక్షల్లో ఫెయిలే!?
- 99 Views
- wadminw
- September 5, 2016
- తాజా వార్తలు
అనంతపురం: శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఓ లెక్చరర్ కీచక పర్వం ఆలస్యంగా వెలుగు చూసింది. కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తన కోరిక తీర్చాలని కాంట్రాక్ట్ లెక్చరర్ గంగాధర్ బెదిరించాడు. లేకుంటే ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేస్తానని హెచ్చరించాడు. దీంతో విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసింది.
దాంతో గంగాధర్‌ను ఎగ్జామ్ వింగ్ నుంచి యూనివర్శిటీ అధికారులు తప్పించి, చేతులు దులుపేసుకున్నారు. యూనివర్శిటీ అధికారుల చర్యలపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అతడిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని యూనివర్సిటీ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
Categories

Recent Posts

