జగన్ను ప్రజలు విశ్వసించరు: తెదేపా
ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని రాష్ట్ర ప్రజలు ఎప్పటికి విశ్వసించరని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. జగన్ అవినీతిని కుటుంబ ఫ్యాక్షన్ ధోరణిని ఛీకొట్టిన ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టి రెండున్నర సంవత్సరాలు గడిచిన ఇంకా ఎలాంటి మార్పు ఆయనలో రాలేదన్నారు. మంగళవారం ఈ మేరకు ఎమ్మెల్యే ఆంజనేయులు ఒకలేఖని విడుదల చేశారు.
యువభేరి పేరుతో విద్యార్థులు, ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు. వైసిపి నేతలు నిరంతరం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. అభివృద్ధిలో ఏపీ అన్ని రాష్ట్రాల్లో కంటే ముందు వరుసలో ఉందన్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమే కారణమన్నారు. రాష్ట్రాభివృద్ధిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ చర్చకు సవాలు చేస్తే తోకముడిచారని ఎద్దేవా చేశారు. జగన్ ఆక్రమాస్తుల కేసులో ఈడీ స్వాధీనం చేసుకున్న ఆస్తులపై ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.


