జన్మభూమి ముగ్గులతో ఆకట్టుకున్న మంత్రి పీతల
- 90 Views
- wadminw
- January 4, 2017
- Home Slider రాష్ట్రీయం
పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో మంగళవారం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రి పీతల సుజాత జన్మభూమి ముగ్గులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈసందర్భంగా వివిధ రకాల ముగ్గులు వేసిన మహిళలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. తెలుగునాట ముఖ్యంగా సంక్రాంతికి ఇంటింటా ముగ్గులువేయడం ఆనవాయిగా వస్తున్నదని ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించి ప్రజల్లో ముగ్గులపై ఆసక్తి పెంపొందించడానికి జన్మభూమి కార్యక్రమంలో కూడా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నదన్నారు.
రాష్ట్రంలో భాషాసంస్కృతిని ప్రోత్సహించే రీతిలో సంక్రాంతి సంబరాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నదని అదేవిధంగా వివిధ ప్రముఖుల జన్మ దినోత్సవాలను రాష్ట్రపండుగగా నిర్వహించుకోవడం జరుగుతున్నదన్నారు. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కూచిపూడిని ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారన్నారు. అదేవిధంగా సంక్రాంతి సంబరాల్లో ముగ్గులపోటీలను నిర్వహించి విజేతలను ఎ ంపిక చేసి వారికి బహుమతులను అందించి ప్రోత్సహిస్తామని చెప్పారు.
ఈకార్యక్రమంలో జడ్పిటిసి గుత్తా సత్య సాయి వరప్రసాద్, యంపిపి మోరంపూడి మల్లిఖార్జునరావు, గ్రామ సర్పంచ్ ఉప్పలపాటి వరప్రసాద్, మండల ప్రత్యేకాధికారి, డ్వామా పిడి యంవి. రమణ, ఆర్డబ్ల్యుయస్ యస్ఇ అమరేశ్వరరావు, యంపిటిసిలు రాజారావు, వెంకటేశ్వరరావు, సొసైటీ ఛైర్మన్ బుజ్జి, తహశీల్ధారు సోమశేఖర్ యంపిడిఓ కృష్ణకుమారి, వ్యవసాయశాఖ ఏడి బుజ్జిబాబు, తదితరులు పాల్గొన్నారు.


