జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో జాతీయగీతానికి అవమానం
- 94 Views
- January 2, 2017
- Home Slider జాతీయం
న్యూదిల్లీ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విపక్షాలు జాతీయ గీతాన్ని అవమానించాయని భాజపా ఆరోపించింది. అందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్చేసింది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.
ఉభయ సభల నుద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్ వోహ్రా సభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న అశాంతి గురించి విపక్ష కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు పీడీపీ-భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దాంతో గవర్నర్ తన ప్రసంగాన్ని అర్థాంతరంగా ముగించారు.
మరో పక్క జాతీయ గీతాలాపన జరుగుతుండగా గవర్నర్ వెళ్లిపోవడం, ప్రతిపక్షాలు ఆందోళన చేయడంపై భాజపా మండిపడింది. ఇది జాతీయ గీతానికి తీరని అవమానమని.. విపక్ష కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, గవర్నర్ క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ ఎమ్మెల్యే రవీందర్ రైనా డిమాండ్చేశారు.


