జర్మనీ వర్సిటీతో బీఆర్‌ఏయూ ఒప్పందం
- 79 Views
- wadminw
- December 22, 2016
- అంతర్జాతీయం
అంబేడ్కర్ విశ్వవిద్యాలయం అధికారులు జర్మనీలోని యూరోపియన్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కౌన్సెల్ (ఈఈఏఆర్సీ) వర్సిటీ అధికారులతో ఉన్నత విద్య కోర్సుల్లో విద్యార్థులకు పరస్పర అవకాశం కల్పించేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎచ్చెర్లలోని స్థానిక అంబేడ్కర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారులు ఈ మేరకు అవగాహన ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి మిర్యాల చంద్రయ్య, రిజిస్ట్రార్ గుంట తులసీరావు ఈఈఏఆర్సీ డైరక్టర్ బెర్ట్రామ్లాహ్ ముల్లర్, ఛాన్సలర్ వెంకటనాగరాజ్ వంగపండు వర్సిటీలలో నిర్వహిస్తున్న కోర్సులు, ఇతర వివరాలను తెలియజేశారు. అనంతరం రిజిస్ట్రార్ తులసీరావు మాట్లాడుతూ ఇరు యూనివర్సిటీల్లోని కోర్సుల గురించి తెలుసుకున్నామని త్వరలో జర్మన్ యూనివర్సిటీ వారి అభిప్రాయం తెలియజేస్తారని అనంతరం యూనివర్సిటీ తరఫున అక్కడకు వెల్లి పరిశీలించి ఏఏ కోర్సులో సంయుక్తంగా నిర్వహించే అవకాశం ఉందో గుర్తిస్తామన్నారు.
జర్మనీకు చెందిన ఈఈఏఆర్సీ వర్సిటీ మన దేశంలో 14 వర్సిటీలతో ఇప్పటకే ఒప్పందం కుదుర్చుకుందని మన రాష్ట్రంలో ఒప్పందం కుదుర్చుకున్న యూనివర్సిటీలో అంబేడ్కర్ వర్సిటీనే మొదటిదన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ చక్రధర్‌బాబు, ఆచార్యులు బిడ్డికి అడ్డయ్య, సుజాత తదితరులు పాల్గొన్నారు.


