జలాశయాల్లో నీటి నిల్వపై ఇంజనీర్లతో కలెక్టర్ సమీక్ష
- 104 Views
- wadminw
- September 3, 2016
- తాజా వార్తలు
కర్నూలు, సెప్టెంబర్ 3 (న్యూస్టైమ్): అవుకు జలాశయంలో 4 టియంసిల నీటి నిల్వ చేసేందుకు ఫారెస్ట్ క్లియరన్స్కు సంబంధించిన అనుమతులు తాను మంజూరు చేస్తానని నీటి నిల్వ చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు చల్లా విజయమోహన్ ఇంజనీరింగు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరు కార్యాలయ సమావేశ భవనంలో గోరుకల్లు, అవుకు జలాశయాల్లో నీటి నిల్వపై ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. శాసనమండలి సభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, బనగానపల్లె, శ్రీశైలం, కోడుమూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బిసి.జనార్థనరెడ్డి, బుడ్డారాజశేఖరరెడ్డి, మణిగాంధీలు, డిఆర్ఓ గంగాధరగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఎస్సార్బీసి కాలువ ద్వారా అవుకు జలాశయంలో 4 టియంసిల నీటిని నింపేందుకు పక్కా ప్రణాళికతో ఈ నెల 11 వతేది జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. గతంలో తాను, సియం పర్యటన సమయంలో అవుకు జలాశయంలో 7 టియంసిల నీరు నింపడానికి ఎందుకు సంకోచిస్తున్నారని ఇంజనీర్లను కలెక్టరు ప్రశ్నించారు. ఎస్.ఆర్.బిసి కింద వున్న ఆయకట్టుకు నీరందిస్తూ అవుకు జలాశయాన్ని నింపేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించి స్పష్టమైన విధానాన్ని అమలు చేయాలని సూచించారు.
గోరుకల్లు రిజర్వాయరులో నీటి నిల్వ చేసేందుకు ఎదురవుతున్న లీకేజి సమస్యలు, ప్రత్యామ్నాయ మార్గాలపై కూడ పూర్తి స్థాయి ప్రణాలికతో రావాలని కలెక్టరు ఆదేశించారు. కెసి కెనాల్ పైన బ్రీచెస్ పడకుండ కెనాల్ వెంట తిరిగి పరిశీలించాలని ఎస్.ఇని ఆదేశించారు. అనధికారికంగా పైపు లైను వేసుకున్న మోటార్లను సీజ్ చేయాలన్నారు. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయరులో ప్రస్తుతం 9.5 టియంపి నీటి నిల్వవుందని కాలువ ప్రవాహనీటి కెపాసిటిని పెంచి వారం రోజులో 13 టియంసి నీటితో నింపాలన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్.ఇ, చంద్రశేఖర్ రావు, తెలుగుగంగ, ఎస్.ఆర్.బి.సి, కెసి కెనాల్ ఎస్ఇలు, ఇఇలు, కర్నూలు, నంద్యాల ఆర్.డి.ఓలు రఘుబాబు, సుధాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


