జాతీయ రహదారిపై లారీ ఢీకొని వ్యక్తి మృతి
- 99 Views
- wadminw
- September 6, 2016
- తాజా వార్తలు
కాకినాడ, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ప్రమాదంలో వెన్నపు కాంతారావు (45) మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు చెందిన కాంతారావు మోపెడ్‌పై రాజమహేంద్రవరం వెళుతుండగా పొట్టిలంక సమీపంలో వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన కాంతారావు, కిరణ్‌లను హైవే అంబులెన్సులో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కాంతారావు మృతిచెందారు.
కేసును ఆలమూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా, చల్లపల్లి వైరుపేటకు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు, అమలాపురం నియోజకవర్గ అధ్యక్షుడు కొంబత్తుల రాంబాబు(40) అనారోగ్యంతో మృతి చెందారు. ఈయనకు భార్య పల్లాలమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రాంబాబు మృతికి రాష్ట్ర బీఎస్సీ ప్రధాన కార్యదర్శి గెడ్డం సంపతరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బతి కృష్ణప్రసాద్ తదితరులు సంతాపం తెలిపారు.
రేషన్ బియ్యాన్ని స్వాహాచేస్తే కఠిన చర్యలు
మిల్లర్లకు తూ.గో. జిల్లా జాయింట్ కలెక్టర్ హెచ్చరిక
కాకినాడ, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): ప్రజాపంపిణీ వ్యవస్ధ బియ్యంను అక్రమంగా తరలించిన రైస్ మిల్లర్స్ పై కఠిన చర్యలు చేపడతామని తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యన్నారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ కోర్టు హాలులో పౌరసరఫరాల అధికారులు, రైస్ మిల్లర్స్‌తో పిడిఎస్ బియ్యం, సీఎంఆర్ బియ్యంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత ఆరు నెలల నుండి కొంత మంది రైస్ మిల్లర్లు చౌకధర దుకాణాల డీలర్లతో కుమ్మక్కై ప్రజాపంపిణీ వ్యవస్ధ ద్వారా సరఫరా చేస్తున్న బియ్యంను సిఎంఆర్గా మారుస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో రైస్ మిల్లర్స్ఉత్పత్తి చేసే బియ్యం పరిశ్రమ మేజర్ పరిశ్రమ అయినందున పిడిఎస్ బియ్యం అక్రమంగా తరలించడం మంచిది కాదని, ఇలాంటి సంఘటనలు పునరావృత్తం అయితే సంబంధిత మిల్లర్స్ పై చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. గత ఖరీఫ్, రబీ సీజన్లలోని బియ్యంను మిల్లర్స్ త్వరగా ఇవ్వాలని ఆయన చెప్పారు. మిల్లర్స్ నుండి 3700 మెట్రిక్ టన్నులు బియ్యం రావ్వాల్సి ఉందని, వాటినీ ఈ నెల 15వ తేదీ లోపు మిల్లర్స్ పౌరసరఫరాల శాఖకు అందజేయాలన్నారు. మిల్లర్స్ అందరూ నిబధ్ధతతో పని చేయాలని, ఎట్టిపరిస్ధితిల్లోను పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం, పునరావృత్తం కాకూడదన్నారు. రైస్ మిల్లర్స్ ఇవ్వాల్సిన బియ్యానికి సంబంధించి స్టాక్ లేకపోతే బ్యాంక్ గ్యారెంటీ తీసుకోవాలని ఎంఎస్ఓలను ఆదేశించారు. బియ్యం ఇవ్వాల్సిన మిల్లర్స్ నుండి ఈ నెల 10వ తేదీ లోపు తీసుకోవాల్సిన బాధ్యత పౌరసరఫరాల శాఖ సిబ్బంది పై ఉందని, వారు తీసుకోకపోతే వారి పై చర్యలు చేపడతామన్నారు. పిడిఎస్ బియ్యం ఏ మిల్లులో ఉంటే వారిపై చర్యలు చేపడతామని జేసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డీఎం ఏ కృష్ణారావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంబటి రామకృష్ణారెడ్డి, ఎంఎస్ఓలు, రైస్‌మిల్లర్స్ తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా చర్యలు: నామన
కాకినాడ, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృధ్ధి కార్యక్రమాలు అమలు తీరును పరిశీలించి, ప్రజలకు అందేలా చర్యలు చేపట్టవల్సిన ఆవశ్యకత ఉందని తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాబంబాబు తెలిపారు. మంగళవారం ఉదయం జిలల్లా పరిషత్ సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన 2వ స్ధాయి సంఘ మావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జడ్పి ఛైర్మన్ మాట్లాడుతూ స్ధాయి సంఘ సమావేశాల ముఖ్య ఉద్దేశం జిలల్లాలో సంక్షేమ పధకాలు ఏ విధంగా జరుగుతున్నాయో సమీక్షించాల్సిన అవసరం ఎంసతైనా ఉందన్నారు. ప్రభుత్వ పధకాలను అమలు చేసే టప్పుడు ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయాలని , అప్పుడే ప్రజలకు అవి చేరే అవకాశం ఉందన్నారు. రెండవ స్ధాయి సంఘ సమావేశం డిఆర్డిఏ పిడి మాట్లాడుతూ ఉన్నతి పధకంలో ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ క్రింద డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణంగా పశుసంవర్ధక శాఖ ద్వారా గేదెలు , ఆవులు, గొర్రెలు, మేకలు అందజేయడం జరుగుతుందన్నారు. 16 నియోజకవర్గాల్లోని 32 మండలాల్లో లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. వీరికి 10 కోట్ల 25 లక్షల 60 వేల రూపాయలు రుణంగా యూనిట్లు అందజేయడం జరుగుతుందన్నారు. అభయ హస్తం పధకంలో డ్వాక్రా మహిళలు 60 సంవత్సరాలు దాటిన వారికి 500 రూపాయలు చొప్పున పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అనపర్తి ఎంఎల్ఏ నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పింఛన్ భర్త చనిపోయన వితంతువులకు భర్త పింఛన్ ఇవ్వాలని కోరగా, ఈ విషయమై ఎండిఓలకు శిక్షణ ఇవ్వడంజరిగిందని, వారే భర్త చనిపోయన వారికి పింఛన్ మంజూరు చేయడం జరుగుతుందని, పిడి చెప్పారు. వృధ్ధాప్య పింఛన్ సంబంధిత వ్యక్తి మరణిస్తే దానిని కూడా విడో పింఛన్‌గా కన్వర్ట్ చేయడం జరుగుతుందన్నారు. ఒక ఇంట్లో వికలాంగులు ఇద్దరు ఉన్నప్పటికీ ఒక్కరికే ఇస్తున్నారని ఎంఎల్ఏ తెలుపగా, ఒక రేషన్ కార్డుకు ఒకే పింఛన్ అని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నందున ఒకే పింఛన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. డిఆర్డిఏ ద్వారా అమలాపురం, రాజమహేంద్రవరం, సామర్లకోట లోని శిక్షణా కేంద్రాల ద్వారా 10వ తరగతి, ఆ పై చదివి, 28 సంవత్సరాల వయస్సులోపు వారికి శిక్షణ ఇవ్వడం జడరుగుతుందన్నారు. శిక్షణా కాలంలో భోజనం, యూనిఫారం, షూ ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదటి దఫాగా 80 మందికి శిక్షణ ఇచ్చి హైదరాబాదులో ఉద్యోగావకాశాలు కల్పించడం జరిగిందన్నారు. ఆశక్తి గల వారు ఈ శిక్షణ పొందవచ్చని పిడి తెలిపారు. గృహ నిర్మాణ శాఖ పిడి మాట్లాడుతూ ప్రతీ నియోజకవర్గానికి 900 గృహాలు మంజూరయ్యాయని, వీటికి లబ్దిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి పంపిస్తే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. గృహానికి లక్షా 50వేలు మంజూరు చేయడం జరుగుతుందని, 95 వేల సబ్సిడీ,52 వేలు ఉపాధి హామీ పధకంలోని, ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. లబ్దిదారులు వారి స్దలమును బట్టి ఇల్లు కట్టుకోవచ్చని 200 చ|| గ|| ల్లో వారు ఇష్టమైన విధంగా ఇల్లు కట్టుకోవచ్చని, మంజూరు అయిన వెంటనే గ్రౌండ్ చేయాలని , దానిని బట్టీ డబ్బు వస్తుందన్నారు. ఇంటి మరమ్మత్తులకు 1700 ఇళ్లకు మంజూరు వచ్చిందని, మరమ్మత్తులకు గానూ 10 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లా పరిషత్ సిఇఓ, డిపిఓ ఇన్చార్జి మాట్లాడుతూ గ్రామాల్లో శానిటేషన్ె బాగుగా లేదని ఫొటో తీసి వ్యాట్సాప్‌లో పెట్టాలని సభ్యులు కోరారు. అలాగే పంచాయతీకి కూడా తెలియజేయాలని, వెంటనే శానిటేషన్ మెరుగు తగు చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాలు, సహకార శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్ధ, బిసి కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఎస్సి కార్పొరేషన్, సాంప్రదాయేతర ఇంధన వనరులు తదితర శాఖల పై సమీక్షించారు. మూడవ స్ధాయి సంఘ సమావేశానికి వై స్ ఛైర్పర్సన్ పెండ్యాల నళినీకాంత్ అధ్యక్షత వహించి, వ్యవసాయం, పశుసంవర్ధక, అటవీ, మత్స్య శాఖ, పట్టు పరిశ్రమ, ఉద్యాన వన శాఖ , డైరీ డెలప్మెంట్ పై సమీక్షించారు. నాలుగు, ఆయిదవ స్ధాయి సంఘ సమావేశాలకు జడ్పి ఛైర్మన్ అధ్యక్షత నవహించి, విద్య, వయోజన విద్య, వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలు, అయిదవ స్ధాయి సంఘ సమావేశంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యక్రవ్లుపై సమీక్షించారు. ఆరవ స్ధాయి సంఘ సమావేశానికి పాలపర్తి రోజా అధ్యక్షత వహించగా, వెనుకబడిన తరగతులు, షెడ్యుల్ కులములు, షెడ్యుల్ తెగలు, మైనారిటీలు, వివిధ ప్రతిభావంతలు, వయోవృధ్ధుల సంక్షేమం పై సమీక్షించారు. ఒకటి, ఏడుస్ధాయి సంఘాలకు జడ్పి ఛైర్మన్ అధ్యక్షత వహించి ఏపిఎస్ ఆర్టిసి, ఆర్ అండ్ బి , పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖల పై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మండపేట ఎంఎల్ఏ వేగుళ్ళ జోగేశ్వరరావు, జడ్పిటిసి సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


