జాతీయ రహదారులకు భూసేకరణ వేగవంతం: సీఎస్
- 98 Views
- wadminw
- December 22, 2016
- Home Slider రాష్ట్రీయం
రాష్ట్రంలో జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర అన్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి హరితహారం, భూ సేకరణ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సేకరణపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. 2017-18 హరితహారం పథకం కింద జిల్లాలకు కేటాయించిన లక్ష్యాల మేరకు మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
నర్సరీల్లో మొక్కల పెంపకం ప్రారంభించాలని, అవసరమైన ప్లాస్టిక్ సంచులను సమకూర్చుకోవాలని కోరారు. పాలనాధికారి మాట్లాడుతూ హరితహారంలో 2017-18 సంవత్సరానికి జిల్లా లక్ష్యం 1.26 కోట్ల మొక్కలని తెలిపారు. జిల్లాలో నర్సరీలను గుర్తించామని, మొక్కలు పెంచేందుకు అన్ని చర్యలు చేపట్టామని వివరించారు. అటవీ సంరక్షకులు ఆనంద్‌మోహన్, డీఆర్డీఓ వెంకటేశ్వర్రావు తదితరులున్నారు.


