టాప్ లేపే ఫొటోలు!
ఏనుగుకు కోపం వస్తే… కాకి కళ్టజోడు పెట్టుకుంటే… ఒకే బైకుపై ఎనమిది ప్రయాణిస్తే? ఇలాంటి ప్రశ్నలు ఎనలేని ఆసక్తిని రేకెత్తిస్తాయి. తాజా తాజా ఎంటర్టైన్మెంట్లకు సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వేదికగా నిలుస్తున్నాయి. అనేక అంశాలకు సంబంధించి ఆసక్తికర ఫోటోలను నెటిజనులు తమ తమ ఆసక్తి మేర సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అప్లోడ్ చేస్తున్నారు. మల్టీ మీడియా విభాగంలో ఫోటోగ్రఫీ కీలక పాత్ర పోషిస్తోంది.
ఫోటోగ్రఫీ రానున్న రోజుల్లో మరింత కీలకంకాబోతున్ననేపధ్యంలో పోటోగ్రఫీకి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను ప్రతిఒక్కరూ అలవరుచు కోవల్సి ఉంది. కొత్త కెమెరా కొనుగోలు చేసేంత బడ్జెట్ మీదగ్గర లేకపోవటంతో పాత కెమెరా కొనుగోలు చేయాలనుకుంటున్నారా? పాత కెమెరాల కొనుగోలు విషయంలో కాస్త అవగాహన కలిగి ఆలోచనాత్మకంగా వ్యవహరించినట్లయితే డబ్బు ఆదా అవటంతో పాటు మన్నికైన కెమెరా మీ చెంతకు చేరుతుంది. ముఖ్యంగా సెకండ్‌హ్యాండ్ డిజిటల్ కెమెరాల కొనుగోలు విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం.
సెకండ్ హ్యాండ్ కెమెరా కొనేముందు తీసుకోవల్సిన జాగ్రత్తలు! మీరు కొనుగోలు చేసే పాత కెమెరాకు సంబంధించి ఫోకస్ రింగ్‌ను నెమ్మదిగా రొటేట్ చేస్తూ అన్ని సెట్టింగ్‌లను పరిశీలించండి.మీరు కొనుగోలు చేసే పాత కెమెరాకు సంబంధించి ఫోకస్ రింగ్‌ను నెమ్మదిగా రొటేట్ చేస్తూ అన్ని సెట్టింగ్‌లను పరిశీలించండి. కెమెరాకు బాడీ ఎంతో కీలకమైనది. దానికి సంబంధించి అన్ని అంశాలను కూలంకుషంగా పరిశీలించండి. డీఎస్ఎల్ఆర్ కెమెరాలు ప్లాస్టిక్, పెయింట్ ఇంకా లెదర్ కవర్లను కలిగి ఉంటాయి. మీరు కొనేది సెకండ్ హ్యాండ్ కెమెరా కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవటం మంచిది.
మీరు కొనుగోలు చేసే సెకండ్ హ్యాండ్ కెమెరాకు సంబంధించి ఎల్సీడీ ప్యానల్ ఇంకా క్లారిటీని ఒకటి రెండు సార్లు చెస్ చేసుకోవల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బ్యాటరీ విషయంలో మోసపోవద్దు. పాత కెమెరాలలో ఎక్కువ ఛార్జింగ్సమస్యలు తలెత్తుతుంటాయి. కాబటి బ్యాటరీ వ్యవస్థ పనితీరు విషయంలో నిశితపరిశీలన అవసరం. మీరు కొనుగోలు చేసే పాత కెమెరాకు సంబంధించి షట్టర్ స్పీడ్ కంట్రోల్ ఇంకా సంబంధిత సెట్టింగ్‌లను చెక్ చేయటం మరవద్దు. మీరు ఎంపిక చేసుకునే సెకండ్ హ్యాండ్ కెమెరాలోని ఫ్లాష్ వ్యవస్థ ఏలాంటి పనితీరునిస్తుందో చెక్ చేయండి.


