టాలీవుడ్ టాప్ డైరక్టర్‌కు హీరోయిన్ మోజు!
సౌత్ హీరోయిన్స్‌లో కాజల్ క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే. ఆమెను కేవలం ప్రేక్షకులే కాదు సినిమా వాళ్లు నచ్చుతారు. లక్ష్మి కళ్యాణంతో కెరియర్ ప్రారంభించిన కాజల్ ఇప్పుడు స్టార్ హీరోయిన్గా ఇమేజ్ తెచ్చుకుంది. ఇక తను స్టార్ అయ్యే ప్రయత్నంలో ఆమెతో సినిమాలు తీసిన దర్శకులు కూడా ఆమెను ఎంతో ఇష్టపడతారు. కాజల్‌పై ఇంతవరకు తనతో సినిమా తీయని ఓ దర్శకుడు మనసు పారేసుకున్నాడు. ఈరోజుల్లో అనే చిన్న సినిమాతో మొదలై ఏకంగా స్టార్ హీరోలతోనే సినిమా తీసే రేంజ్‌కు ఎదిగిన మారుతి కాజల్ అంటే అదో ప్రత్యేకమైన ఇష్టం అంటున్నాడు. కాజల్ స్మైల్ ఎక్స్ప్రెషన్స్ అన్ని సూపర్ అనేస్తున్నాడు మారుతి. ఆమె ఒప్పుకుంటే సినిమా చేసేస్తా అంటున్నాడు కూడా. మరి మారుతి ఇంత ఇష్టపడుతున్నాడుతాన్నడని కాజల్‌కు తెలుసో తెలియదో కాని ఫేడవుట్కు దగ్గరవుతుంది అనుకుంటున్న టైంలో అమ్మడు లక్కీ ఆఫర్లనే కాదు లక్కీ ఫ్యాన్స్‌ను కూడా ఏర్పాటుచేసుకుంటుంది. సో ఈ ఊపుచూస్తుంటే కాజల్ ఊ అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వలే కాని ఆమెతో వరుసెంట సినిమాలు చేసేలా ఉన్నాడు మారుతి. రీసెంట్గా బాబు బంగారం హిట్‌తో మంచి జోష్‌లో ఉన్న మారుతి ఇప్పుడు కొత్త హీరోతో సినిమా తీసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే రెండు కథలను సిద్ధం చేసుకున్న మారుతి ఒకటి స్టార్‌కు వినిపించాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. దర్శకుడిగా ఎప్పుడు తను నూటికి నూరు పళ్లు న్యాయం చేసే మారుతి దర్శకత్వంలో ఏ హీరో అయినా సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. మంచి కథ దొరకాలే కాని మారుతి మరో ట్రెండ్ సెట్ సినిమా దర్శకుడిగా మారినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎన్ని మూవీల్లో నటించామన్నది ముఖ్యం కాదు.సరైన చిత్రాలు ఎన్ని చేశామన్నదే ముఖ్యం. ఎందుకంటే స్టార్‌గా ఎదిగే క్రమంలో మంచి చిత్రాలు పడితే వారికి తెలియకుండానే మంచి కథలు వారి వద్దకు వస్తుంటాయి. అందుకే చాలా మంది మంచి పాత్రలకి, మంచి కథలకి అంతటి ప్రాధాన్యతని ఇస్తారు. ఇదిలా ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో యాంకర్ పొజిషన్ నుండి హీరోయిన్గా మారిన హాట్ బ్యూటీ రేష్మి గౌతమ్ ఇప్పుడు మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. గుంటూరు టాకీస్ మూవీతో తనకి బోల్డ్ స్టార్‌గా గుర్తింపు వచ్చినప్పటికీ తరువాత చేసిన ఏ మూవీ తనకి ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకురాలేకపోయాయి. తను గ్లామర్ చూపించటానికి రెడీ అయినప్పటికీ దాన్ని సరైన రీతిలో చూపించే డైరెక్టర్స్ రేష్మి గౌతమ్‌కి దొరకటం లేదు. ఇదిలా ఉంటే తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రేష్మి గౌతమ్ త్వరలోనే బాక్సాపీస్ కమర్షియల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతుంది. దిల్ రాజు, మారుతి, అల్లు అరవింద్ చిన్న చిత్రాలకి ఈ మధ్య కాలంలో ప్రాధాన్యతని ఇస్తున్నారు. మారుతి ఏదైన చిన్న సినిమాని తీస్తే అందులో దిల్ రాజు, అల్లు అరవింద్ పెట్టుబడులు పెడుతుంటారని అంటారు. అందులో భాగంగానే ఇప్పుడు మారుతి నిర్మాణంలో ఓ చిన్న సినిమా రెడీ కాబోతుంది. అందులో ప్రధాన హీరోయిన్గా రేష్మి గౌతమ్‌ని సెలక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం కావటంతో రేష్మి గౌతమ్‌ని చిత్ర యూనిట్ సెలక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో బోల్డ్ కంటెంట్ ఎక్కువుగానే ఉంటుందని అంటున్నారు. మారుతి నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం రేష్మి గౌతమ్‌కి బ్రేక్ ఇవ్వనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రేష్మి గౌతమ్ నటించిన తను వచ్చెనంట మూవీ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని సెన్సార్ చేసుకుంది.


