టీనేజ్ యువత కోరికలు ఏమిటి?
యువత ఆలోచనలు విభిన్నం. పెద్దలతో పోల్చిచూస్తే యుక్తవయసులోని వారు తీసుకున్న నిర్ణయాలు కూడా కాస్త విచిత్రంగానే ఉంటాయి. ఒక విధంగా యువతీ యువకులు ఒకరికి ఒకరు అసలు అర్ధంకారు. అబ్బాయిలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. టీనేజ్ బాయ్స్ విషయానికి వస్తే వాళ్లు కాస్త కాంప్లికేటెడ్‌గా ఉంటారు. వీళ్లను అర్థం చేసుకోవడం మరింత కష్టంగా ఉంటుంది. కానీ మీ క్లాస్‌లో మీకు నచ్చిన అబ్బాయిని చాలా కేర్ ఫుల్ హ్యాండిల్ చేయడం అవసరం. టీనేజ్ అబ్బాయిలు చాలా అత్యుల్లాసంగా, క్రేజీగా, కూల్‌గా ఉంటారు. టీనేజ్‌లో ఉన్నప్పుడు మనమందరం అన్ని విషయాలను నేర్చుకునే స్టేజ్‌లో ఉంటాం. పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి ముందు కొన్ని విషయాలను ప్రయోగిస్తూ ఉంటాం.
ఒకవేళ మీరు టీనేజ్ అమ్మాయి అయి ఉండి టీనేజ్ అబ్బాయిలు అమ్మాయిల నుంచి ఏం కోరుకుంటారు? అమ్మాయిల విషయంలో ఏం నచ్చుతాయి? ఏం నచ్చవు అనే విషయాలు తెలుుకోవాలని ఉందా? అయితే ఇక్కడ ప్రస్తావించిన కొన్ని అంశాల గురించి మీరు తెలుసుకోవాల్సిందే. టీనేజ్ అబ్బాయిలు అందమైన, ముద్దుచ్చే ముఖాన్ని ఖచ్చితంగా ఆకర్షితులవుతారు. వాళ్లు చాలా సినిమాలు చూసి అందులో హీరోయిన్ని చూసి అలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలని కలలు కంటారు. ఆత్మ గౌరవం టీనేజర్స్ సాధారణంగా చాలా ఇన్ సెక్యూరిటీస్‌ని ఫేస్ చేస్తారు. ముఖంపై చిన్న మొటిమ లేదా బెల్లీ ఫ్యాట్ ఏదైనా చాలా ఇన్ సెక్యూర్‌గా ఫీలవుతారు.
కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ ఉండి ఎలాంటి సమస్యలు లేకపోతే మీరు మీకు నచ్చిన అబ్బాయికి అందంగా కనిపిస్తారు. కామన్ ఇంట్రెస్ట్స్ అమ్మాయిలు తమకు నచ్చిన అబ్బాయికి నచ్చిన విషయాలు, అలవాట్లలోనే ఆసక్తి ఉంటే అబ్బాయిలు వెంటనే మీపై ఆసక్తి చూపుతారు. టీనేజ్ అబ్బాయిలు స్టైలిష్‌గా, కూల్‌గా ఉండే అమ్మాయిలను ఇష్టపడతారు. ఫ్యాషనబుల్‌గా, స్టైలిష్‌గా ఉండే అమ్మాయిలను ఇష్టపడతారు. బీడ్స్, జీన్స్, ట్రెండీ యాక్సెసరీస్ వేసుకునే అమ్మాయిలకు అబ్బాయిలు ఎట్రాక్ట్ అవుతారు.
హై హీల్స్ కొంతమంది టీనేజర్స్ హైహీల్స్ అంటే చాలా ఇష్టపడతారు. అమ్మాయిలు హైహీల్స్ వేసుకుంటే అబ్బాయిలు తెగ ఎట్రాక్ట్ అవుతారట. ఒత్తిడి తగ్గడానికి టీనేజ్ అబ్బాయిలు అమ్మాయిలకు హెల్ప్ చేయడం ద్వారా చాలా హ్యాపీగా ఫీలవుతారు. అది చిన్న సహాయమే అయినా వాళ్లకు చాలా కిక్ ఇస్తుంది. రిజెక్ట్ చేయడాన్ని ఇష్టపడరు టీనేజ్ అబ్బాయిలు.. రిజెక్ట్ అవడాన్ని ఏమాత్రం ఇష్టపడరు. వాళ్ల యంగ్‌గా ఉన్నప్పటికీ అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలనేది తెలుసు. అమ్మాయిలకు ప్రపోజ్ చేయడానికి చాలా భయపడతారు. వాళ్లు రిజెక్ట్ చేస్తే సహించలేరు.


