టెలికం కంపెనీల మధ్య ఆఫర్ల వార్!
కలంతో కుస్తీ పట్టే రోజులు పోయి వేళ్లతో మిరా కిల్స్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పు డంతా అరచేతి మాయాజాలం. యువతీ యువకులే కాదు, పెద్దల వరకు అంతా చేతిలో స్మార్ట్ ఫోన్‌తో దర్శనమిచ్చే వారే. చేతిలో 4జీ సెల్ ఉంటే ప్రపంచాన్ని వీక్షించే సౌకర్యం సాంకేతికంగా అందుబాటులోకి వచ్చాక మార్కెట్ వేగవంతమయింది. తాజాగా రిలయన్స్ జియో మరో సంచలనం అయింది. మార్కెట్లోకి వచ్చిన ఈ సెల్ సర్వీస్ వినియోగదారులకు ప్రత్యేక ఆకర్షణ కాగా, తమ సర్వీస్‌లు కాపాడుకోవడం ప్రత్యర్థులకు పరీక్షగా మారింది. ఏమిటీ జియో, దీని ప్రత్యేకం, నెట్వర్క్ అందుతున్న పరిస్థితి గురించి తెలుసుకోవాల్సి వస్తే… నంబర్ పోర్టబులిటీ లేదు. జియో కావాలసినవారు కొత్త నంబర్ తీసుకోవాల్సిందే.
ఉన్న నంబర్‌తో జియోనెట్వర్క్లోకి వెళ్లే అవకాశం లేదు. భవిష్యత్తులో పోర్టబులిటీ అవకాశం ఉండే ఛాన్స్ ఉన్నా నాలుగు నెలల ఉచిత సర్వీస్‌కు మాత్రం కొత్త నంబరే వాడాల్సి ఉంటుంది. శ్యాం సంగ్ 4జీ మొబైల్స్ సింగిల్ సిమ్ ఉన్నవే. డ్యూయల్ సిమ్ ఉన్న మోడల్స్ ఒకటి రెండే. అయినప్పటికీ జియో వాడకంపై ఆసక్తి ఉన్న వారు తమ పర్సనల్ నంబర్ వదులు కోవడం లేదా వేరే మొబైల్లో వేసుకోవడమో అనివార్యమని చెప్పాలి. మూడు నెలల నుంచే మార్కె ట్ జియో సిమ్‌లను రిలయన్స్ సంస్థ మూడు నెలల నుంచి మార్కెట్ చేస్తోంది.
కాకపోతే ఇప్పటి వరకు ఎటువంటి ప్రచారం లేకపోవడంతో పెద్దగా తెలియలేదు. గత గురువారం సంస్థ అధినేత ప్రకటనతో ఒక్కసారిగా మార్కెట్ ఊపందుకుంది. నాలుగు నెలలపాటు ఉచిత సేవలనడంతో సిమ్‌లను కొందరు బ్లాక్ చేసి అమ్ముతున్నారు. తొలుత కేవలం శ్యాంసంగ్తోపాటు రిలయన్స్ వారి ఎల్వైఎఫ్ సెట్ల్లో మాత్రమే ఈ సిమ్‌లు పనిచేసే అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 5నుంచి ప్రారంభమయ్యే కొత్త స్కీమ్‌లలో దాదాపు అన్ని 4జీ హ్యాండ్ సెట్స్‌కు అందుబాటులోకి తెస్తు న్నారు. ఏఏ సౌకర్యాలు పొందవచ్చు? దేశంలో ఎక్కడికైనా ఉచిత అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ సౌకర్యం పొందవచ్చు. అన్లిమిటెడ్ వీడియో కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయం నాలుగు నెలలు ఉంటుంది. వాయిస్ కాల్స్‌లో కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా హైడెఫినిషన్ వాయిస్ కాల్స్‌ను అందిస్తున్నారు. దీంతోపాటు అన్లిమిటెడ్ హైస్పీడ్ డేటా (4జీ) అందిస్తున్నారు.
సొంత యాప్‌తో మార్కెట్లోకి జియో సిమ్స్తోపాటు ఇప్పటికే రిలయన్స 4జీ మొబైల్స్ (ఎల్వైఎఫ్)ను మార్కెట్లోకి దించింది. సొంత యాప్ ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ ఫోన్లకు గూగుల్ సంస్థ యాప్స్ యూనివర్శల్‌గా అందుబాటులో ఉంటే యాపిల్ మాత్రం సొంతంగా యాప్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. జియో పే యాప్ ద్వారా దాదాపు 319 చానల్స్ లైవ్‌లో చూడొచ్చు. జియో ఆన్ డిమాండ్ ద్వారా సినిమాలు, టీవీ షోస్ వీక్షించవచ్చు. జియో బీట్స్ ద్వారా కోరుకున్న భాషలో పాటలను, జియో మ్యాగ్జైన్స్ను ఆన్లైన్లో చదవొచ్చు.
జియో న్యూస్ ద్వారా స్థానిక వార్తలు, జియో ఎక్స్‌ప్రెస్ న్యూస్ ద్వారా తాజా వార్తలు తెలుసుకోవచ్చు. జాబ్ డ్రైవ్ ద్వారా 5జీబీ పర్సనల్ స్టోరేజీతోపాటు బ్యాక్ అప్ సౌకర్యాన్ని అందిస్తున్నారు. ఇది పూర్తిగా క్లౌడ్ స్టోరేజీ. జియో సెక్యూరిటీ ద్వారా డిజిటల్ లైఫ్‌కు అవసరమయ్యే రక్షణ కల్పిస్తున్నారు. సిమ్ కోసం ఏం కావాలి? జియో సిమ్‌లు కావాలనుకునే వారు గుర్తింపు కార్డు, పాస్ పోర్టు ఫొటోతో స్టోర్‌కు వెళ్లాలి. మీరు వాడుతున్నది 4జీ మొబైల్ అని కన్ఫర్మ్ చేసుకున్న తరువాత సిమ్ అందిస్తారు.


