డయల్ యువర్ కలెక్టర్‌కి 13 వినతులు
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 13 వినతులు వచ్చాయి. జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ పి.రజనీకాంతరావు ఫోన్ కాల్స్‌ను స్వీకరించి వాటి పరిష్కార నిమిత్తం సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పథకం ఈసీ విధులకు హాజరు కావడం లేదని, తగిన చర్యలు తీసుకోవాలని సంతబొమ్మాళి మండలంలోని మేఘవరం గ్రామానికి చెందిన ఎస్.ధనరాజు ఫిర్యాదు చేశారు. రాజీవ్ స్వగృహ పథకం ద్వారా మంజూరు చేసిన ఇళ్ళకు తగిన సదుపాయాలు కల్పించాలని ఎచ్చెర్ల మండలంలోని ఎస్.ఎం.పురం గ్రామానికి చెందిన సూర్యనారాయణ కోరారు. అలాగే అడంగల్ పత్రం కోరినప్పటికీ ఇవ్వడం లేదని రణస్థలం మండలంలోని తోటపాలెం గ్రామానికి చెందిన బి.వెంకటప్పారావు తన ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ ఆర్.కూర్మనాథ్, జిల్లా పరిషత్ సీఈవో బి.నగేష్, డీఎస్వో వి.సుబ్రహ్మణ్యం, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.


