డేటింగా… అమ్మాయిలూ జాగ్రత్తపడండిలా!
స్నేహం, ప్రేమ ఇలా ఏ బంధమైనా ఎక్కువగా ప్రభావితమయ్యేది అమ్మారులే. ఒకవేళ ఆ బంధం బలపడితే సరికానీ, తెగిపోతే మాత్రం అమ్మారులే నష్టపోతారన్నది సత్యం. ఏ విషయంలోనైనా మగవాళ్ళు నష్టపోవడం చాలా తక్కువ. ఎవరో సున్నితమనస్కులైతే తప్ప ఇలాంటి బ్రేకప్స్‌ను అబ్బారులు ఈజీగానే తీసుకుంటున్నారు. అసలీ బ్రేకప్స్ రావాల్సిన పనేముంది? డేటింగ్‌కు ముందే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. డేటింగ్‌కు ముందు అమ్మారులు ఎలా జాగ్రత్తపడాలంటే? మీరు డేటింగ్‌కు ఎంచుకోవాలనుకునే అబ్బారు కొత్త ప్రయత్నాలు చేయకుండా అన్నీ ఏకపక్షంగా చర్యలకే ప్రాధాన్యమిస్తుంటే అలాంటి వ్యక్తిని దూరంగా పెట్టారు.
లేదంటే ప్రమాదమే. మీరు వారి బానిసలుగా తలచుకుంటే అంటే అమ్మారులు వంటింటికే పరిమితం అనే చందంగా మాట్లాడే అస్సలు వారి జోలికే పోకూడదు. ఎప్పుడూ తాము కొన్న వస్తువుల ధరలు, హోటల్ తిండి ఖర్చులు గురించి పదేపదే ప్రస్తావించేవారితో చాలా కష్టం. డేటింగ్ చేసినన్నాళ్ళూ వీరు మరింత పిసినారితనంతో ప్రవర్తిస్తారన్నదానికి అవి సంకేతాలు. స్పోర్ట్స్ చూసేందుకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే అబ్బారులు… ఓ అనుబంధం పట్ల, కుటుంబం పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతలను ఎన్నడూ పట్టించుకోరు.
ఇవన్నీ, వారు బాల్య పోకడల నుంచి బయటపడలేదన్న విషయాన్ని సూచిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా, ప్రతి క్షణం నిఘా వేసే వ్యక్తికి దూరంగా ఉండాలి. బయటికెళితే ఎవరితో తిరుగుతోంది? ఏంచేస్తోంది? వంటి అనుమానాలతో వేగిపోయే మగవాణ్ణి ఎంతదూరం పెడితే అంతమంచిది. బంధం పట్ల అవగాహన లేకుండా, చపలచిత్తం ప్రదర్శిస్తుంటారు కొందరు. ఓసారి అనుబంధం కొనసాగించాలని, మరోసారి పిల్లలు కావాలని అంటుంటారు… రెణ్నెల్ల తర్వాత, అసలేదీ తేల్చుకోలేకపోతారు. వీరితోనూ జాగ్రత్తగా ఉండాలని మానసిక నిపుణులు అంటున్నారు.


