డైరెక్టర్ బోయపాటికి షాక్ ఇచ్చిన అక్కినేని
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న మాస్ డైరెక్టర్స్‌లో బోయపాటి శ్రీను ఒకరు. మాస్ చిత్రాలను తెరకెక్కించి బాక్సాపీస్ వద్ద హిట్ కొట్టాలంటే సామాన్య విషయం కాదు. ప్రస్తుతం ట్రెండ్ మారుతున్న ఇటువంటి సమయంలోనే మాస్ చిత్రాలను ప్రేక్షకులు ఆధరిస్తున్నారంటే అది కచ్ఛితంగా డైరెక్టర్ ప్రతిభే అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే టాలీవుడ్లో కమర్షియల్ సక్సెస్ చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా బోయపాటి శ్రీనుకి మంచి పేరు ఉంది. సరైనోడు మూవీతో అల్లుఅర్జున్‌కి కమర్షియల్ సక్సెస్‌ని అందించిన బోయపాటి శ్రీను ప్రస్తుతం బెల్లంకొండ శ్రీను మూవీతో బిజిగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తరువాత అక్కినేని హీరోతో మూవీ చేయనున్నారని అంటున్నారు. అఖిల్ రెండవ సినిమా విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో రానుంది. ఈ మూవీ నవంబరులో సెట్స్‌పైకి వెళ్లనుందని అంటున్నారు. ఇక విక్రమ్ కుమార్ ప్రాజెక్ట్ తరువాత అఖిల్ తన మూడవ సినిమాని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్నారని అంటున్నారు. అయితే తాజాగా బోయపాటి శ్రీను నాగార్జునతో కథా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఈ చర్ఛల్లో బోయపాటి శ్రీను చెప్పిన కథకి నాగార్జున పూర్తి మార్పులు కోరినట్టుగా తెలుస్తుంది. గతంలో వినాయక్ అఖిల్‌తో చేసిన పవర్ఫుల్ కథ బాక్సాపీస్ వద్ద బోల్తాపడటంతో ఇప్పుడు బోయపాటి శ్రీను చెప్పిన కథ సైతం అలాగే ఉందని నాగార్జున అభిప్రాయపడ్డారు. అఖిల్‌కి ప్రేమ కథా చిత్రం కావాలని బోయపాటిశ్రీనుకి నాగార్జున చెప్పటంతో ఈ మాస్ డైరెక్టర్ కొంత ఇరకాటంలో పడ్డారని అంటున్నారు. అయితే అఖిల్‌తో సినిమా చేయాలని బోయపాటి శ్రీను ఆసక్తి చూపటంతో మంచి ప్రేమ కథా చిత్రంతో మరోసారి నాగార్జునని కలిసే ఛాన్స్ ఉందని అంటున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను – రాజమౌళి, త్రివిక్రమ్ తరవాత ఒక పక్కా కమ్మర్షియల్ హిట్ కొట్టాలి అంటే ఈ డైరెక్టర్ వైపే చూస్తున్నారు అందరూ. దమ్ము ని పక్కన పెడితే ఈయన కెరీర్లో ప్లాప్ అనే పదమే లేదు. ఆ రేంజ్లో మాస్ మసాలా హిట్లు తీయగలిగాడు. క్లాస్‌కి కూడా తను తక్కువ కాదు అంటూ సరైనోడు సినిమాలో అల్లు అర్జున్‌ని భీభత్సంగా ఎలివేట్ చేస్తూ బ్లాక్ బస్టర్ కొట్టేసాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బోయపాటికి విపరీతమైన క్రేజ్ ఉండనే ఉంది. ఎంతగా అంటే చిరు తన 151 సినిమాని బోయపాటితో చేస్తే ఎలా ఉంటుంది అని ఇప్పటికే అల్లు అరవింద్ దగ్గర పెద్ద డిస్కషన్ పెట్టడం, బోయపాటి – అల్లు అరవింద్ ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం దాదాపుగా అంతా ఓకే అనుకోవడం కూడా జరిగిపోయింది. నిజానికి బోయపాటి శ్రీను నేపధ్యం చాలా చిన్నది, తక్కువ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగిన సూపర్ డైరెక్టర్ అతను. ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు ఎదురుకొని – కష్ట నష్టాలకి ఓర్చుకుని ఈ రోజు ఈ స్థానంలో నిలబడ్డాడు బోయపాటి. ఒకప్పుడు పోసాని కృష్ణమురళి దగ్గర పనిచేసి అతని బంధువుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి డక్కా ముక్కీలు తిని పైకి వచ్చాడు. అయితే ఈ మధ్య కాలంలో బోయపాటి మీద విపరీతమైన విమర్శలు పెరిగిపోయాయి. డైరెక్టర్ కొరటాల శివ స్వయంగా బోయపాటి గురించి మాట్లాడుతూ నా కథని టోటల్‌గా తీసేస్కుని నా పేరు కూడా వెయ్యలేదు, అప్పుడే డిసైడ్ అయ్యాను డైరెక్టర్ అవ్వాలి అని అంటూ చెప్పుకొచ్చాడు. బోయపాటి కథలనీ, కథలు ఇచ్చినవారినీ అస్సలు గౌరవించడు అనీ సొంత కథలు రాసుకోలేడు కూడా అని కొరటాల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. మరి కొన్ని రోజుల తరవాత స్వయంగా పోసాని కృష్ణ మురళి సైతం ఇవే తరహా వ్యాఖ్యలు విసిరేశాడు బోయపాటి మీద. తన దగ్గర చేతులు కట్టుకుని నుంచునే బోయపాటి ఒకానొక సమయంలో తన భార్యని సైతం అవమానించాడు అంటూ సంచలన ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఎందరో రైటర్లని తను పరిచయం చేసినా కూడా ఎవ్వరూ తనముందర ఇలా తోక ఆడించలేదు అనీ కానీ బోయపాటి వ్యక్తిత్వం అంత చీప్‌గా ఉంటుంది అని తనకి తెలీదు అంటూ పోసాని చేసిన ప్రకటన వీడియో సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు పోసాని, కొరటాల మాటలకి బోయపాటి ఏం సమాధానం చెబుతారు అనేది ఇంకా తెలియలేదు. బోయపాటి ఏమీ మాట్లాడరేం? అనవసరంగా, మాటకు మాట వస్తుందని సైలెంట్‌గా వుండిపోయారా? అన్నది అనుమానం. కానీ కాదట, సరైన వేదిక కోసం చూస్తున్నారు అని తెలుస్తోంది. త్వరలో అలాంటి అవకాశం ఒకటి రాబోతోంది. అప్పుడు ఆయన కూడా మాటల తూటాలు విసిరేందుకు రెడీ అవుతారని తెలుస్తోంది. బాలయ్య-, బోయపాటిల కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ లెజెండ్. ఈ సినిమా రాయలసీమలో ఒక థియేటర్లో వెయ్యి రోజుల ప్రదర్సన పూర్తి చేసుకుంటోంది ఈ సందర్భంగా మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసే ప్లాన్‌లో ఉన్నారు బాలయ్య అభిమానులు. ఆ వేదికని తాను ఉపయోగించుకోవాలి అని బోయపాటి శ్రీను అనుకుంటున్నారు అని తెలుస్తోంది. ఆ వేదిక మీద తనమీద వచ్చిన విమర్సలకి సమాధానం చెబుతూనే వారి మీద కూడా గట్టి విమర్శలు చెయ్యడానికి బోయ సిద్దం అవుతున్నారట. కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.


