డ్రగ్స్ సరఫరా కేసులో ఒకరి అరెస్ట్
- 72 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
నెల్లూరు, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): మాదక ద్రవ్యాల సరఫరా కేసులో నెల్లూరు నగరానికి చెందిన మారంరెడ్డి శ్రీహరిరెడ్డిని నెల్లూరు టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గర నుంచి సుమారు రూ.60 లక్షల విలువైన బ్రౌన్ సుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నగర డీఎస్పీ వెంకటానంద రెడ్డి తెలిపారు. కాగా, వీధిలో ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడిని నీళ్ల ట్యాంకర్ చిదిమేసింది. ఈ సంఘటన కావలి పట్టణంలోని అరుంధతీయపాళెంలో జరిగింది.
ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు వీధిలో చిగురుపాటి మధు, వాణి దంపతుల కుమారుడు సందీప్ (3) వీధిలో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో ఓ నీళ్ల ట్యాంకర్ స్థానికులకు నీళ్లు పట్టి వెనుదిరిగి వెళ్తుంది. ఈ క్రమంలో ట్యాంకర్‌ను రివర్స్ చేసుకుంటున్న సమయంలో సందీప్‌పై ట్రాక్టరు వెనుక చక్రం ఎక్కింది. స్థానికులు గమనించి బాలుడిని బయటకు తీశారు. బైక్‌పై ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
చిన్నారి సందీప్ మృతి విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి వచ్చారు. చిన్నారి బంధువులతో మాట్లాడి ప్రమాదం ఎలా జరిగింతో అడిగి తెలుసుకున్నారు. చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట డీఆర్‌యూసీసీ సభ్యులు కుందుర్తి కామయ్య, కౌన్సిలర్లు గుడ్లూరు మాల్యాద్రి, మందా శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పరుసు మాల్యాద్రి, మలిశెట్టి వెంకటేశ్వర్లు, అక్కిలిగుంట మాల్యాద్రి ఉన్నారు.
సోమిరెడ్డికి దమ్ముంటే సవాల్‌ను స్వీకరించాలి
నెల్లూరు, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణను పదవి నుంచి తొలగించేందుకు టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. నిత్యం మంత్రి నారాయణకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయాలని విపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలపై సోమిరెడ్డి ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. సోమిరెడ్డి అవినీతి అక్రమాలపై నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సోమిరెడ్డికి దమ్ముంటే సవాల్‌ను స్వీకరించాలని కాకాని గోవర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫౌండేషన్ కోర్సులను ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తుంటే, మీరు విద్యార్థుల విలువైన కాలాన్ని నష్టపరుస్తున్నారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చిత్తూరు, నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో ఫౌండేషన్ కోర్సులు నిర్వహణ ఏవిధంగా ఉందని మువ్వా రామలింగాన్ని మంత్రి ప్రశ్నించారు. మువ్వా మాట్లాడుతూ 10వ తరగతి మినహాయించి కోర్సులు నిర్వహిస్తామని చెప్పారు. దీంతో మంత్రి నారాయణ మువ్వా పై తీవ్రంగా మండిపడ్డారు. ‘నేను చెప్పింది మీరు చేయాలి, మీ సొంత నిర్ణయాలు వద్దు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేడ్లు ముఖ్యం కాదని, ఫౌండేషన్ కోర్సులు ద్వారా విద్యార్థులకు ఉపయోగం ఉంటుందన్నారు. నీవు డీఈఓగా వచ్చి రెండు నెలలు గడుస్తుంది, ఈ రెండు నెలలు ఫౌండేషన్ కోర్సులు ప్రారంభించకుండా ఉండడంతో విద్యార్థులు విలువైన కాలాన్ని నష్టపోయారన్నారు. అనంతరం చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్దిక్ జెయిన్, నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, చిత్తూరు డీఈఓ నాగేశ్వరరావుతో ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తాను రెండు జిల్లాలకు ఇన్చార్జి మంత్రినని, రెండు జిల్లాల్లో ఫౌండేషన్ కోర్సులు పూర్తి స్థాయిలో నిర్వహించాలన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఫౌండేషన్ కోర్సులు రెండు జిల్లాల్లో ప్రారంభించాలన్నారు. ఈ క్రమంలో చిత్తూరు డీఈఓను ఎంత మంది విద్యార్థులతో కోర్సును మొదలుపెడుతారని మంత్రి ప్రశ్నించారు. చిత్తూరు డీఈఓ మాట్లాడుతూ 3వేల మందితో మొదలుపెడతానని సమాధానం ఇచ్చారు. దీంతో మంత్రి 3వేల మందితో మొదలుపెట్టేందుకు జిల్లా కలెక్టర్, మంత్రి మీతో మాట్లాడాలా అని మండిపడ్డారు. రెండు జిల్లాల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవే విద్యార్థులు 30శాతం మందితో ఈనెల 14వ తేదీ నుంచి ఫౌండేషన్ కోర్సు నిర్వహించాలన్నారు. ఫౌండేషన్ కోర్సుకు అవసరమయ్యే మెటీరియల్ కూడా సరఫరా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
అవినీతి అధికారులకు ఆదాయ వనరు నెల్లూరు
నెల్లూరు, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): టిఖానికి గతిలేని చిన్న స్థాయి ఉద్యోగికి కూడా నెల్లూరు జిల్లాలో పని చేయాలంటే మహా ఇష్టం. అధికారులు, ఉద్యోగులు నెల్లూరు జిల్లాలో ఉద్యోగం కావడాన్ని పుర్వ జన్మ సుక్రుతంగా భావిస్తారు. ఇందుకు కారణం నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయ వనరులు ఇతర జిల్లాలతో పోల్చుకుంటే పుష్కలంగా లభించడమే. సోమవారంనాడు నెల్లూరు ఆర్టీవో పుర్ణచంద్రరావు ఆస్తులపై దాడులు చేసిన ఏసీబీ అధికారులు సుమారు 10 కోట్ల రూపాయలు (మార్కెట్ రేటు 50 కోట్లు) ఉండచ్చునని భావిస్తుండగా ఆయన నెల్లూరు జిల్లా ఆర్టీవోగా బాధ్యతలు చేపట్టిన రెండు సంవత్సరాల కాలంలోనే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించారు. అంతకుముందు ఇదే శాఖ కార్యాలయంలో పని చేసే మోటార్ వేహికల్ ఇన్స్పెక్టర్ నుంచి 30 కోట్లు, అదే నెలలో నెల్లూరు జిల్లా సబ్ రిజిస్ట్రార్‌గా పని చేసిన మరో అధికారి నుంచి 100 కోట్లు ఆస్తులను ఈ ఏడాది ఏసీబీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. ఈ ఐదు సంవత్సరాల్లో పరిశీలించిన్నట్టయితే ఆదాయాన్ని మంచి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సుమారు 10 మంది ఉన్నత స్థాయి అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంత లక్ష రూపాయలకుపైగా ప్రభుత్వం నుంచి జీత భత్యాన్ని పొందుతున్నవారు కావడం గమనార్హం. వీరు కాకుండా లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డ ఉద్యోగులైతే లెక్కకు మించి ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో ఎంఆర్వోలు, ఎంపీడీవోలు, వీఆర్వోలు, ఇలా రకరకాల హోదాలలో పని చేసే ఉద్యోగులంతా 50 వేలు, 30 వేలు చివరు 5 వేలు కూడా లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డ వారే. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున పారిశ్రామికరణ, వ్యవసాయం, వివిధ వాణిజ్య పరమైన అంశాలకు సంబంధించి కోట్లలోనే లావాదేవిలు జరుగుతుంటాయి. పలు ప్రభుత్వ శాఖల్లో వీటికి అనుమతులు ఇవ్వాంటే అధికారుల సంతకాలు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు తప్పని సరి. అధికారులు చట్టు తిరగలే వాళ్లు సంతకాలు చేయడానికి డిమాండ్ చేసే లంచాలను కొందరు ప్రజలు సమర్ధించుకుని పనులు చేసుకుంటుండగా మరికొందరు మాత్రం అధికారుల మీద తిరగబడి ఏసీబీని ఆశ్రయించడంతో కొన్ని సంఘనలో అధికారులను అరెస్టు చేయడం జరుగుతోంది. ఏసీబీ డీఎస్పీగా తోట ప్రభాకర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక మంది అధికారులను లంచాలు తీసుకుంటూ అరెస్టు చేయగా ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఆర్టీవోలు, సబ్రిజిస్ట్రాలు, డీఆర్డీఏ పీడీలు, ఎంవీఐలు ఇలా పెద్ద పెద్ద అధికారులను అరెస్టులు చేస్తూ సంచల సృష్టిస్తున్నారు. మూడు నెలల క్రితం జిల్లా పౌర సరఫరాల శాఖకు సంబంధించి కస్టమ్స్, మిల్లింగ్ రైస్ అనే పథకంపై ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ దృష్టిసారించి సుమారు వెయ్యి కోట్లు అవినీతి జరిగినట్లు నివేదికలు పంపడంతోపాటు పేదలకు చెందాల్సిన బియ్యాన్ని సిఎంఆర్ పథకం కింద రైస్ మిల్లర్లు గోడౌన్లలో దాచి ఉంచారన్న ఆరోపణలపై సుమారు 3 కోట్లు విలువ చేసే అవినీతి అంశాన్ని ఆయన బయట పెట్టి కేసులు కూడా నమోదు చేశారు. దీనిపై ఉన్నతస్థాయిలో రాజకీయ నేతలు ప్రవేశించి ఆ కుంభకోణాన్ని అణగదొక్కి పారేశారు. చిన్న చిన్న ఉద్యోగులు 5 వేలు, 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడితే నిర్దాక్షణ్యంగా అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్న ఏసీబీ అధికారులు రాజకీయ నేతలపై ఎందుకు దృష్టిసారించడం లేదనే ఆరోపణలు ప్రజల నుంచి విన వస్తున్నాయి. జిల్లాలో జరిగే పెద్ద పెద్ద కుంభకోణాల వెనుక రాజకీయ నేతల ప్రత్యక్ష లేక పరోక్షంగా హస్తముందనేది స్పష్టం కాగా దీనిపై అధికారులు దృష్టి పెడితే అవినీతిని మరింత నిర్మూలించి టోట ప్రభాకర్ వంటి నిజాయితీగల అధికారులకు మానసిక ధైర్యం కలిగే అవకాశం ఉందని ప్రజలు చెబుతన్నారు. మొత్తం మీద అవినీతి అధికారులకు నెల్లూరు జిల్లా ఒక ఆదాయ వనరుగా మారిపోయింది.


