తండ్రి చిరు మూవీని డ్యామేజ్ చేస్తున్న తనయుడు చరణ్?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ ఖైదీ నంబర్ 150. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ విషయంలో నెగిటివ్ టాక్స్ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. చాలా గ్యాప్ తరువాత వస్తున్న చిరు మూవీపై ఈ విధమైన ప్రచారం జరగటానికి కారణాలు ఎలా ఉన్నప్పటికీ ఖైదీ నంబర్ 150 మూవీకి డిజిటల్ ప్రమోషన్ అంతగా లేదని అంటున్నారు. ఎందుకంటే మెగాస్టార్ అంతటి స్టార్ బాక్ ఈజ్ బ్యాక్ అంటూ ఖైదీ నంబర్ 150 వస్తున్న మూవీకి, ఈ మూవీకి ఓ రేంజ్లో పబ్లిసిటి అవసరం. గతంలో చిరంజీవి ఫాంలో ఉన్నాడు కాబట్టి పెద్దగా ప్రమోషన్ అవసరం లేదు. ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది. ఎంతటి సినిమాకి అయినా ప్రమోషన్ తప్పనిసరి అయింది. అందుకే ఖైదీ నంబర్ 150 మూవీకి సైతం ప్రమోషన్ భారీగా ఉండాలని అంటున్నారు. అలాంటిది ఇప్పటి వరకూ ఖైదీ నంబర్ 150 మూవీకి ఎటువంటి ప్రమోషన్స్ లేవు. డిజిటల్ ఫ్లాట్ ఫాంపైనా ఈ మూవీపై సరైన ప్రమోషన్స్ జరగటం లేదు. దీంతో చాలా మంది ఈ మూవీపై నెగిటివ్ పబ్లిసిటీని చేస్తున్నారు. ఇదే ఎక్కువైతే మూవీ రిలీజ్ నాటికి ఇది కొంప ముంచే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇకనైనా ఖైదీ నంబర్ 150 మూవీకి నిర్మాతగా ఉంటున్న రామ్ చరణ్ ఈ మూవీకి సరైన ప్రమోషన్స్ ని ప్లాన్ చేసుకుంటే మంచిదని అంటున్నారు. ఈ అభిప్రాయం ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తుంది. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇందుకోసం మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కచ్ఛితంగా ఖైదీ నంబర్ 150 మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్‌ని తిరగరాస్తుందనే గట్టి నమ్మకంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ వినాయక్ సైతం ఈ మూవీని పకడ్భంధీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులలో మరింతగా ఆసక్తి రేకెత్తిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి నెలలో ఖైదీ నెం. 150 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఐదు రోజులుగా ఖైదీ నెం. 150 మూవీ సాంగ్‌ని చిత్రీకరించారు. చిరంజీవి, లక్ష్మి రాయ్‌లపై ఈ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరిచారు. ఈ సాంగ్ పూర్తి కావటంతో దీనికి సంబంధించిన న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం మేరకు బాస్ ఈజ్ బ్యాక్ అన్న ఈ మాస్ సాంగ్‌ని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరించారు. దేవిశ్రీ అందించిన మాస్ బీట్‌కి, లారెన్స్ స్టెప్స్ అందించారు. అయితే సాంగ్ చిత్రీకరణ సమయంలో చిరంజీవి డాన్స్‌ని చూసి ఇంప్రెస్ అయిన ఓ ఫిమేల్ డాన్సర్ అక్కడిక్కడే చిరంజీవిని హత్తుకుందని అంటున్నారు. ఈ పరిణామానికి చిరు సైతం షాక్ అయ్యాడని అంటున్నారు. తరువాత ఆ అమ్మాయిని వివరాలు కనుక్కుంటే చిరు ఈ వయస్సులోనూ డ్యాన్స్ చేస్తుంటే యంగ్ స్టార్స్ డ్యాన్స్ చేస్తున్నట్టుగానే ఉందని అంటున్నారు. అందుకే తను చిరుని హగ్ చేసుకోవాలనిపించి, ఆ విధంగా చేశానని చెప్పుకొచ్చింది. ఇది ఒకరకంగా చిరుకి షాకింగ్‌లా ఉన్నప్పటికీ మరోవైపు ఆ డాన్సర్ పొగడ్తలకు ముగ్ధుడయ్యాడని అంటున్నారు. ఇక ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించిన కత్తికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ ఇండస్ట్రీ వర్గాలని ఆశ్ఛర్యపరిచేలా జరిగింది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ఈ మూవీకి సంబంధించిన రైట్స్‌పై భారీ క్రేజ్ ఏర్పడిందని అంటున్నారు.


