తప్పుడు ప్రచారాలు మానుకోండి: ఆకుల సుజాత
- 72 Views
- wadminw
- December 15, 2016
- రాష్ట్రీయం
నిజామాబాద్, డిసెంబర్ 14 (న్యూస్టైమ్): రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు దీనిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఆకుల సుజాత మండిపడ్డారు. బుధవారంనాడు తన చాంబర్లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. ఆ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అభివృద్ధి పనులను పట్టించుకోలేదని విమర్శించారు.
గడిచిన రెండున్నర సంవత్సరాల్లో నగర అభివృద్ధికి ఎంపిక కవిత, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త కోట్ల రూపాయలను మంజూరు చేరుంచారని ఆమె గుర్తు చేశారు. ఆ నిధులతో కాంగ్రెస్ హయాంలో నిలిచిపోరున భూగర్బ డ్రైనేజీ పనులు, బైపాస్ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని సుజాత తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మురళీ, టీఆర్ఎస్ నాయకులు కిషన్ తదితరులు పాల్గొన్నారు.


