తమిళనాడు మాజీ సీఎం కరుణానిధికి అస్వస్థత
చెన్నై, అక్టోబర్ 25: డీఎంకే అధితనే, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కరుణానిధి అస్వస్థతకు గురయ్యారని మంగళవారంనాడు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. రోజువారి వాడే మందు సరిపడకపోవడంతో కరుణానిధి అలర్జీకి గురైనట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. పూర్తిగా స్వస్థత చేకూరే వరకు రోజువారి పార్టీ కార్యకలపాలాలకు దూరంగా ఉంటారని ఆ ప్రకటన తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో నెలరోజులకుపైగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె రాజకీయ ప్రత్యర్థి, డీఎంకే నేత ఎం కరుణానిధి కూడా అస్వస్థతకు గురయ్యారు.
రోజు తీసుకునే మెడిసిన్స్ వల్ల అలర్జీ కావడంతో కరుణానిధి అస్వస్థతకు గురైనట్టు మంగళవారం డీఎంకే ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. కరుణానిధి విశ్రాంతి తీసుకుంటున్నారని, సందర్శకులను కలవబోరని డీఎంకే పేర్కొంది. కరుణానిధికి పరామర్శించేందుకు వచ్చి ఆయనకు ఇబ్బంది కలగించవద్దని విజ్ఞప్తి చేసింది. కరుణానిధి అస్వస్థతకు గురయ్యారని తెలియడంతో డీఎంకే కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో గత నెల 22న చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె పరిస్థతి విషమంగా ఉందంటూ వదంతులు వచ్చాయి. అయితే జయలలిత కోలుకుంటున్నారని, త్వరలో డిశ్చార్జి చేస్తామని అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.


