తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
- 78 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
తిరుపతి, అక్టోబర్ 25 (న్యూస్టైమ్): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం భక్తులు తిరుమల కొండకు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దీంతో సర్వదర్శనం కోసం భక్తులు 5 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న వీరికి దర్శన సమయం 4 గంటల సమయం కలుగుతోంది. 50 సుదర్శనం, 300 ఆన్లైన్ భక్తులకు 1 సమయంలో దర్శనం లభిస్తోంది. కాలిబాటన అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గంలో వచ్చే దివ్య దర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు 2 గంటల సమయంలో స్వామి దర్శనం కలుగుతోంది.
సోమవారం వేకువజామున 5 గంటల నుండి మంగళవారం వేకువజామున 5 గంటల వరకు 65,487 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. కేంద్రీయ విచారణ కార్యాలయం, టీబీసీ, కౌస్తవం ఎంబీసీ 34, పద్మావతి అతిథి గృహం, సన్నిదానం, భక్తులకు గదులు అందుబాటులో ఉన్నాయి. కల్యాణకట్ట, నిత్యాన్నప్రసాద సముదాయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
భక్తులు తమ తలనీలాలను సుమారు 24,320 మంది భక్తులు సమర్పించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సోమవారం వేకువజాము నుండి రాత్రివరకు భక్తులు శ్రీవారిని దర్శించుకుని సమర్పించిన కానులను ఆలయంలోని పరకమణిలో లెక్కింపులు నిర్వహించారు. దీంతో శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలు లెక్కింపులు నిర్వహించగా ఈ మేరకు సుమారు రూ.3.93 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు సమకూరినట్లు అధికారులు తెలిపారు.


