తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
- 73 Views
- wadminw
- December 15, 2016
- తాజా వార్తలు
తిరుమల, డిసెంబర్ 14 (న్యూస్టైమ్): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం భక్తులు తిరుమల కొండకు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దీంతో వీరికి సర్వదర్శనం కోసం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న వీరికి దర్శన సమయం 4 గంటల సమయం కలుగుతోంది. 50 సుదర్శనం, 300 ఆన్లైన్ భక్తులకు గంటల సమయంలో దర్శనం లభిస్తోంది. కాలిబాటన అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గంలో వచ్చే దివ్య దర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు 2 గంటల సమయంలో స్వామి దర్శనం కలుగుతోంది.
మంగళవారం వేకువజామున 5 గంటల నుండి బుధవారం వేకువజామున 5 గంటల వరకు 57,019 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. కేంద్రీయ విచారణ కార్యాలయం, టీబీసీ, కౌస్తవం ఎంబీసీ 34, పద్మావతి అతిథి గృహం, సన్నిదానం, గదులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. కల్యాణకట్ట, నిత్యాన్నప్రసాద సముదాయం వద్ద భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు తమ తలనీలాలను సుమారు 22,033 మంది భక్తులు సమర్పించుకుని స్వామివారిని దర్శించుకున్నారు.


