తిరుమలేశుని సేవలో విశాఖ శారధపీఠాధిపతి
- 64 Views
- wadminw
- December 22, 2016
- రాష్ట్రీయం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని మంగళవారం ఉదయం విశాఖ శారధపీఠాదిపతి శ్రీస్వరూపననేంద్రస్వామిజి మంగళవారం ఉదయం స్వామివారికి నిర్వహించే నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపుల ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆగమశాస్త్రాల ప్రకారం తిరుమల కొండపై విమానాల రాకపోలక నియంత్రణ విషయంలో కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి అశోక్ గజపతి విఫలమయ్యారని తప్పుబట్టారు. అదే విధంగా గో మాంసం బక్షించరాదని గో మాంస బక్షకులను గో అక్రమ రవాణాకు పాల్పడే వారిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.
బంగ్లాదేశ్, ఇతర దేశాలకు గోవుల సరఫరాలను నియంత్రించడంలో ఆర్ఎస్ఎస్ విఫలమైందని తెలిపారు. గో రక్షణతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగుతాయని వాటిని నియంత్రించడంలో ఏమైనా లోటుపాట్లు జరిగితే ప్రభుత్వాలు వాట మనుగడ కోల్పోతుందని తెలిపారు. అంతకుముందు సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకోగా స్థానిక పద్మావతి అతిథి గృహాలు సముదాయవం వద్ద టీటీడీ అధికారులు వసతి ఏర్పాట్లు చేశారు.
రాత్రి విశ్రాంతి తీసుకున్న ఆయన శిష్యబృందానికి టీటీడీ అధికారులు ఆలయం ముందు భాగాన ఇక్తికపాల్ (ఎర్రతివాచి) పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. మొదట ధ్వజస్తంభానికి మొక్కుకుని స్వామివారిని దర్శించుకున్న అనంతరం వకుల మాతను సందర్శించి హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో పెద్ద, చినజీయంగార్లు స్వరూపననేంద్రస్వామిజి వద్ద ఆశీసులు పొందారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు, స్వామిజికి లడ్డూ ప్రసాదాలను అందజేశారు.


