తెలంగాణ ప్రభుత్వానికి త్వరలో కొత్తగా వెబ్ పోర్టల్
- 93 Views
- wadminw
- January 8, 2017
- Home Slider రాష్ట్రీయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ విభాగం మూడు భాషల్లో సరికొత్త వెబ్ పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఈ పోర్టల్ తొలత ఇంగ్లీష్‌లో ఆ తరువాత, తెలుగు, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుందని ఐటీ శాఖ కార్యదర్శి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్కృతి, చరిత్ర ఇంకా ముఖ్యమైన గణాంకాలతో పాటు సమగ్ర సమాచారాన్ని ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ వంటి ప్రతిష్టాత్మక పథకాలకు సంబంధించిన సమస్త సమచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఈ పోర్టల్‌ను రూపొందిస్తున్నట్లు హర్‌ప్రీత్‌సింగ్ బుధవారం ఇక్కడ తెలిపారు. అలానే, ప్రభుత్వ పథకాలకు సంబంధించి వివిధ దరఖాస్తులను ఈ పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ వెబ్ పోర్టల్‌లో ప్రత్యేకమైన ఫోటో ఇంకా వీడియో గ్యాలరీలతో పాటు నిరంతర వార్తలను అప్డేట్ చేయనున్నారు.


