తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు!
- 80 Views
- wadminw
- September 22, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): అవసరమైనప్పుడు పడినా పడకపోయినా మొత్తానికి తెలుగు రాష్ట్రాలను వానలు ఇప్పట్లో వీడనంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దగా వరదల తాకిడి లేనప్పటికీ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మాత్రం వానలు దంచికొడుతున్నాయి. మెదక్, వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిస్లున్నాయి. మంగళవారం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షంతో మెదక్ జిల్లాలో చెరువులు అలుగులు పారుతున్నారుు. మంజీరా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మంజీరా ప్రాజెక్టులో నీటి మట్టం 19 టీఎంసీలకు చేరుకుంది. పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నారుు. కొండాపూర్ మండలం గుంతపల్లిలో విద్యుత్ షాక్‌తో హర్షవర్ధన్ అనే వ్యక్తి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. మొరుునాబాద్, పెద్దేముల్ ప్రాంతాల్లో వేల ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న, ఆకుకూరలు ఇతర పంటలు నీట మునిగారుు.
ధారూరు బాలుర ఉన్నత పాఠశాల స్టాఫ్ రూం కూలింది. వరంగల్ జిల్లాలో వేల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలు దెబ్బతిన్నారుు. పలువురు రైతుల కరెంటు మోటార్లు కాలిపోగా మరికొన్ని వాగుల్లో కొట్టుకుపోయారుు.రాఘవాపురం గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వీఆర్వో ఎండీ షబ్బీర్ అలీ నీటి ప్రవాహానికి కొట్టుకుపోరుు మృతి చెందాడు. స్టేషన్ ఘన్ పూర్లో పెద్దమ్మతల్లి ఆలయ ప్రహరీ కూలిపోరుుంది. వరంగల్ నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యారుు. మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. తాడూరులో అత్యధికంగా 17 సెంటీమీటర్లు, తెలకపల్లి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లాలో మోత్కూరు, గుండాల, ఆత్మకూర్ (ఎం), చిలుకూరు, నడిగూడెం, నాగార్జునసాగర్, మోత్కూరు, చిలుకూరు మండలాల్లో చెరువులు, కుంటలు నిండి అలుగులు పోస్తున్నాయి. పంటలు నీటమునిగాయి. మోత్కూరులో ఏకంగా 21 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
దీంతో ఈ ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పోచంపల్లి మండలంలోని పిల్లాయపల్లి వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి నార్కట్‌పల్లి మండలం తొండల్వాయి గ్రామంలో చేపరి బాలమల్లయ్య (70) నీటిలో మునిగి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం మినహా జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. ముల్కలపల్లి మండలంలో అత్యధికంగా 14.62 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 407 అడుగుల నీటినిల్వ సామర్థ్యం ఉన్న కిన్నెరసానిలోకి 406 అడుగుల నీటిమట్టం చేరింది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు, అపెక్స్ కౌన్సిల్ నిమిత్తం దేశ రాజధాని హస్తినకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి వెళ్లిన మంత్రి హరీశ్‌రావు అక్కడ చాలా బిజీగా ఉండి కూడా పటాన్ చెరులో ఇద్దరు యువకుల ప్రాణాలు కాపాడగలిగారు!
ఒకదశలో వారి కోసం ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. వేణు, నిరంజన్ అనే వ్యక్తులు పటాన్ చెరులో బస్సు దిగి తమ సొంతూరు పోచారం వెళ్తున్నారు. మధ్యలో పెద్దవాగు దాటుతుండగా వరద ఉధృతి పెరిగి యువకులు కొట్టుకుపోయారు. చెట్లు కొమ్మలు, బండరాళ్ల సాయంతో ఓ మట్టి దిబ్బపైకి చెరుకున్నారు. ఈ దృశ్యాన్ని స్థానికులు సెల్ఫోన్లో వీడియో తీసి మంత్రి హరీశ్‌కు వాట్స్‌ప్‌లో పంపారు. 5 నిమిషాల్లో స్పందించిన మంత్రి వారిని వెంటనే రక్షించాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌ను అదేశించారు. దీంతో అధికారులు కదిలారు. తొలుత తాడు వేసి రక్షించే ప్రయత్నం చేశారు. కానీ సాధ్య పడలేదు. వాట్సప్‌లోనే వివరాలను ఎప్పటికప్పడు తెలుసున్న హరీశ్ ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా వారిని రక్షించాలని ఆదేశించారు. చివరకు అధికారులు తెప్పల్లో గజ ఈతగాళ్లను పంపించి యువకులను కాపాడారు.
కాగా, హైదరాబాద్ మహానగరంలో తాజాగా జల విలయం సృష్టించిన సంగతి తెలిసిందే. కబ్జాకు గురైన చెరువులన్నీ ఉప్పొంగుతున్నాయి. కట్టలు తెంచుకొని నగరాన్ని ముంచెత్తుతున్నాయి. నాలాలన్నీ ఉగ్రరూపం దాల్చి ఉరకలెత్తుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 155 కాలనీలను ముంచెత్తాయి. 115 అపార్ట్మెంట్లను జలమయం చేశాయి. వేలాది మంది కంటి మీద కునుకు కరువై భయం గుప్పిట్లో బతుకుతున్నారు. మంగళవారం రాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలమైంది. శివారు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. హకీంపేట్‌లో 16.7 సెంటీమీటర్లు, షాపూర్‌నగర్‌లో 16.4 సెంటీమీటర్లు, కూకట్‌పల్లిలో 12.2 సెంటీమీటర్లు, బొల్లారంలో 9 సెంటీమీటర్ల భారీ వర్షం కురవడంతో ఆ ప్రాంతాలన్నీ చిగురుటాకులా వణికిపోయాయి.
విద్యుత్ సరఫరా నిలిపేయడంతో అనేక ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి. భారీ వర్షాలకు నగరంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. కుండపోత వర్షంతో నగర జీవి నరకాన్ని చవిచూశాడు. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, జీడిమెట్ల, షాపూర్‌నగర్, చింతల్, బోయిన్పల్లి, నిజాంపేట్ ప్రాంతాల్లోని ప్రతి వీధి చెరువును తలపించింది. వర్షాలకు పద్మావతినగర్‌కు చెందిన సవిత అనే మహిళ, నిజాంపేట్‌లో అపార్ట్మెంట్లోకి చేరిన నీటిని తోడేస్తుండగా కనకదుర్గా ప్రసాద్ మృతి చెందారు. కొంపల్లిలో ఇంటి గోడ కూలి ఆర్మూర్‌కు చెందిన నాగలింగం మృతి చెందాడు. ఇక హుస్సేన్‌సాగర్ నిండుకుండను తలపిస్తోంది. దీని గరిష్ట నీటి మట్టం 513.41 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తిగా నిండింది కూకట్పల్లి, బుల్కాపూర్, పికెట్ నాలాల నుంచి 5 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా దిగువనున్న 4 తూముల నుంచి 4 వేల క్యూసెక్యుల నీటిని బయటకు వదులుతున్నారు. సాగర్‌కు ఆనుకొని ఉన్న లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు.
ఉస్మాన్‌సాగర్ (గండిపేట్) జలాశయం 1790 అడుగుల గరిష్ట మట్టానికిగాను ప్రస్తుతం 1767.75 అడుగుల మేర నీరు చేరింది. హిమాయత్‌సాగర్ గరిష్ట మట్టం 1763.500 అడుగులకు గాను 1732.84 మేర వరద నీరు చేరింది. హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 2,500 చెరువులు ఉండగా వాటిలో 1000 చెరువుల వరకు కబ్జాకు గురైనట్లు అంచనా. దీంతో ఆయా ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం కురిసినా కాలనీలు నీటమునుగుతున్నాయి. గురువారం కూడా చాలాచోట్ల ఇదే జరిగింది. నిజాంపేట్‌లో తుర్కచెరువు నిండు కుండలా మారి పొంగి పొర్లడంతో బండారి లే అవుట్ కాలనీ పూర్తిగా నీటమునిగింది. అపార్ట్మెంట్లలో సెల్లార్లలోకి నీరు చేరి 200 కార్లు, ద్విచక్ర వాహనాలు నీటమునిగాయి.
నిన్న రాత్రి 9 గంటల నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో పూర్తిగా అంధకారం అలుముకుంది. అపార్ట్మెంట్ వాసులు బయటకు రాలేకపోయారు. వారికి తాళ్ల సహాయంతో మంచినీళ్లు, పాల ప్యాకెట్లు అందజేశారు. కూకట్పల్లి ఆల్విన్ కాలనీ, జీడిమెట్ల సూరారం కాలనీలు నీటమునిగాయి. మియాపూర్, కూకట్పల్లి, లింగంపల్లి, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు అపార్ట్మెంట్లలోకి చేరడంతో స్థానికులు అల్లాడారు. నాచారం ఎర్రగుంట్ల చెరువు నిండి నాలా పొంగింది. బోయిన్‌పల్లిలో రామన్నకుంట చెరువు తెగి జనావాసాల్లోకి భారీగా వరద నీరు చేరింది. బేగంపేట్ నాలా ఉప్పొంగడంతో అల్లంతోట బస్తీ జలమయమైంది. కూకట్పల్లి ప్రగతినగర్, ముసాపేట్, ఎర్రగడ్డ, ఖైత్లాపూర్ ప్రాంతాల్లోనూ అపార్ట్మెంట్ సెల్లార్లలోకి నీరు చేరి వందలాది వాహనాలు నీటమునిగాయి.
కుత్బుల్లాపూర్, కొంపల్లి, మేడ్చెల్, చింతల్, సుభాష్‌నగర్, జీడిమెట్ల పారిశ్రామికవాడ, సుభాష్‌నగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌స్తంభాలు నేలకొరిగాయి. రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు రెండు రోజుల పాటు సెలవు ఇచ్చారు. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో కరెంట్ నిలిపివేశామని, నీటిని పూర్తిగా తోడిన తర్వాత సరఫరాను పునరుద్ధరిస్తామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. వాగులో చిక్కుకున్న యువకుడిని రక్షించి అందరి చేతా శభాష్ అనిపించుకున్నాడు ఓ హమాలీ! భారీ వర్షాలకు పటాన్ చెరు ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని పెద్దవాగు పొంగింది. హత్నూర్ మండలం సికింద్లాపూర్ గ్రామానికి చెందిన శ్రీను అనే యువకుడు ఫలక్‌నుమాకు బస్సులో బయలుదేరాడు. పెద్దవాగు పొంగడంతో బస్సు దిగి వాగు దాటేందుకు యత్నించి వరదలో చిక్కుకుపోయాడు.
అధికారులు అక్కడికి చేరుకొని యువకుడిని రక్షించే ప్రయత్నం చేస్తుండగా పక్కనే ఉన్న రైస్‌మిల్లులో పనిచేసే హమాలీ నిరంజన్ (ఒడిశా) ప్లాస్టిక్ డబ్బా ద్వారా ఈదుకుంటూ వెళ్లి శ్రీనును రక్షించాడు. నిరంజన్ కు స్థానికులు రూ.4 వేల నగదు అందించి అభినందించారు. 2000లో ఆగస్టు 24న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 24.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్థాయిలో వర్షం కురిసింది. హకీంపేట్‌లో 16.7 సెంటీమీటర్ల రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. షాపూర్‌నగర్‌లో 16.4 సెంటీమీటర్లు, కూకట్‌పల్లిలో 12.2 సెంటీమీటర్లు, బొల్లారంలో 9 సెంటీమీటర్లు, కుత్బుల్లాపూర్‌లో 9.4 సెంటీమీటర్లు, మాదాపూర్‌లో 7.4, బాలానగర్‌లో 7.2 సెంటీమీటర్లు, బేగంపేట్‌లో 6.8 సెంటీమీటర్లు, శేరిలింగంపల్లిలో 5 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. నగరంలో సగటున 7 నుంచి 8 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో నగరంలో శుక్ర, శనివారాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.


