త్రిషతో శింబు పెళ్లి ?
- 111 Views
- admin
- October 16, 2020
- Home Slider సినిమా
త్రిష తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్గా వెలిగింది. ఇప్పటికీ ఎక్కువ సినిమాల్లోనే నటిస్తుంది. కాగా గతంలో రానాతో డేటింగ్ చేసిందనే రూమర్లు ఉన్నాయి. ఆ తర్వాత చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను కూడా పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది. కానీ శింబులానే ఈమెకు కూడా ఏ బంధం నిలవలేదు. అయితే ప్రస్తుతం ఆమె తమిళ హీరో శింబుతో రొమాన్స్ చేస్తుందని జోరుగా ప్రచారం సాగుతుంది. త్వరలో అతడ్ని పెళ్లాడబోతుందని కోలీవుడ్ టాక్. కాగా శింబు కూడా గతంలో నయనతారతో ప్రేమాయణం నడిపాడు. తర్వాత విడపోయారు. తర్వాత హన్సిక తో కనెక్ట్ అయ్యాడు శింబు. ఈసారి ఇంకాస్త ముందుకెళ్లాడు. విషయం పెళ్లిపీటల వరకు కూడా వెళ్లింది. కానీ ఆ రిలేషన్ షిప్ కూడా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం శింబు వరుసగా ఆలయాలు చుట్టేస్తున్నాడు. రహస్యంగా ప్రత్యేక పూజలు చేయిస్తున్నాడు. వీళ్లిద్దరి పెళ్లి గురించి శింబు తండ్రి, నటుడు టి. రాజేందర్‌ను అడిగితే ఆయన అవునని కానీ, లేదని కాని చెప్పకుండా ఉండిపోయాడు. దీంతో వీళ్లద్దరి పెళ్లి ఖాయమని టాక్ వినిపిస్తోంది.


