త్వరలో వాట్సాప్‌లోకి మరో ఫీచర్
- 88 Views
- wadminw
- December 21, 2016
- అంతర్జాతీయం
‘సోషల్ మీడియా’ ప్రాచుర్యంలోకి వచ్చాక వినియోగదారుల వృద్ధిరేటులో ‘వాట్సప్’ ఎంతటి కీర్తి ఘడించిందో అందరికీ తెలిసిందే. వాట్సాప్ వినియోగంలోకి రాకముందు వరకూ రాజ్యమేలిన అనేక సామాజిక అనుసంధాన వేదికలను పక్కకు నెట్టేసి వినియోగదారులు ఈ అప్లికేషన్‌ను వాడడడం మొదలుపెట్టారు. పోటీదారుల ఫీచర్లను, మారుతున్న పరిస్థితులను అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు తన అప్లికేషన్లో వాట్సాప్ సరికొత్త ఫీచర్లను జోడిస్తూ వస్తోంది. ఈ క్రమంలో కొత్తగా మరో సరికొత్త ఆప్షన్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్.
ప్రస్తుతం బీటా వెర్షన్‌గా డెవలపర్లకు అందుబాటులో ఉన్న ఈ ఆప్షన్‌ను వీలైనంత తొందరలో వాడుకలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఫీచర్ విషయానికి వస్తే… వాట్సాప్‌లో ఒక మెసేజ్ పంపిన తర్వాత అందులో ఏమైనా పొరపాటు ఉంటే అరెరె అంటూ నాలుక కరుచుకుంటాం. మళ్లీ దాన్ని సవరిస్తూ కొత్త మెసేజ్ పంపాల్సిందే తప్ప పాత దాన్ని ఏమీ చేయలేం. కానీ అది గతమే.
దానికీ చెక్ పెడుతూ కొత్తగా ప్రవేశపెడుతున్న ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే. ఒకసారి పంపిన మెసేజ్‌ని అన్ సెండ్ చేయడం, లేదా దాన్ని ఎడిట్ చేయడం కూడా సాధ్యం అవుతుందట. కొద్ది రోజుల క్రితమే ఫీచర్స్‌ని అప్డేట్ చేసి కస్టమర్లకు మరిన్ని సౌకర్యాలు కల్పించిన వాట్సాప్ ఇప్పుడు తాజా ఆప్షన్‌తో ఆకట్టుకోనుంది. ఇప్పటి వరకు ఉన్న వాట్సాప్ వర్షన్లో ఎవరికైనా ఏదైనా మెసేజ్ ఒక్కసారి పంపిస్తే ఇక దాన్ని మనం డిలీట్ చేయలేం. వెనక్కి తీసుకోనూలేం. ఒక వేళ డిలీట్ చేసినా మన ఫోన్లోనే డిలీట్ అవుతుంది తప్ప ఎవరికి పంపామో వారి ఫోన్లో మాత్రం అలాగే ఉంటుంది. అయితే దీనికి చెక్ పెడుతూ సరికొత్త సౌకర్యాన్ని కొత్త వర్షన్లో వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది.
అయితే ఇప్పుడు కొత్త ఫీచర్ ద్వారా ఒకసారి పంపిన మెసేజ్‌ను అన్‌సెండ్ చేయడం లేదా దానిని ఎడిట్ చేసే ఆప్షన్ కూడా ఉందట. ఎవరైనా స్నేహితులకు లేదంటే ఏదైనా గ్రూప్‌లో మెసేజ్ పంపించిన తర్వాత ఒక వేళ దాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అంటే, ఈ కొత్త ఆప్షన్లతో ఒక్క మెసేజ్‌లే కాకుండా పొరపాటున పంపిన ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు ఇలా ఏవైనా ఇతరుల ఫోన్లో నుంచి కూడా డిలీట్ చేసేయొచ్చన్న మాట. గ్రూప్‌లో పోస్టు చేసిన దాన్ని కూడా ఎవరికీ కనిపించకుండా తొలగించవచ్చు.
వాట్సప్ బీటా వెర్షన్లో మాత్రమే కొత్తగా రివోక్ అనే బటన్ ఉంటుందని, దాన్ని ట్యాప్ చేస్తే పంపిన మెసేజ్ కూడా పోతుంది. మిగితా వెర్షన్లలో కూడా త్వరలో అందుబాటులోకి తేనుంది. ఇంతకుముందు గత సంవత్సరం నుంచి జీమెయిల్ కూడా ఇలాంటి ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పొరపాటున ఒక మెయిల్ పంపినా, దాన్ని కావాలంటే అన్డూ చేయొచ్చు. అలా చేస్తే, అవతలివాళ్ల ఇన్‌బాక్స్ లోంచి కూడా అది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు వాట్సప్‌లో ఇది వస్తే అందులో రెండో అతిపెద్ద అప్‌గ్రేడ్ అవుతుంది.


