దళితుల అభ్యుతే ప్రభుత్వ లక్ష్యం: జేసీ
- 64 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
ఏలూరు, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): ఎస్సి, ఎస్‌టిల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, ఉపప్రణాళికల అమలు తీరుతెన్నులపై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా చంద్రన్నదళితబాట కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టరు – 2 యంహెచ్ షరీఫ్ అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశమందిరంలో మంగళవారం సాయంత్రం చంద్రన్నదళితబాట కార్యక్రమం నిర్వాహణా ఏర్పాట్లను వివిధ శాఖాధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 23న చంద్రన్న దళితబాట కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు.
ఈకార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రానికే ఆదర్శంగా చంద్రన్నదళితబాటను నిర్వహించాలన్నారు. గత రెండేళ్లలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి జిల్లాలో అమలు చేసిన ෂඩ්රිඩ්රශ්රී సంక్షేమ కార్యక్రమాలు ప్రస్పుటించే విధంగా ఆయా శాఖలు పెద్ద ఎత్తున ఎ గ్జిబిషన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను తాము చేస్తామని చెప్పారు. గత రెండేళ్లలో ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక అమలుతీరు, ఎస్సీ, ఎస్టీలకు ఆయా శాఖల ద్వారా అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలిపే బుక్ లెట్‌ను కూడా రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈకార్యక్రమంలో మెప్మా తరపున 5 కోట్ల రూపాయలు, డిఆర్డిఏ తరపున మరో 5 కోట్ల రూపాయలు డ్వాక్రామహిళలకు రుణాలందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా జిల్లాలో 37 శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు అమలు చేసిన అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను తెలియజేయడంతోపాటు ఆయా శాఖల ద్వారా వివిధ ఉపకరణాలు అందించడం జరుగుతుందన్నారు. ఎన్టిఆర్ జలసిరి, ఐటిడిఏ ద్వారా కూడా ఉపకరణాలు అందిస్తామన్నారు. ఈనెల 27 సాయంత్రంనాటికే చంద్రన్న దళితబాట కార్యక్రమం నిర్వాహణా ఏర్పాట్లను ఖచ్చితంగా పూర్తి చేయాలన్నారు. 28వ తేదీ ఉదయం 9 గంటలకే సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమై, స్థాల్స్, ఎగ్జిబిషన్ అతిథిలు సందర్శించి లబ్దిదారులకు వివిధ ఉపకరణాలను పంపిణీ చేస్తారనా్నరు. అనంతరం అతిథిల సందేశాలుంటాయన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని అధికారులకు యంహెచ్ షరీఫ్ సూచించారు. ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ ఉప సంచాలకులు రంగలక్ష్మీదేవి, పశుసంవర్ధకశాఖ జేడీ జ్ఞానేశ్వర్, ఎస్సీ కార్పోరేషన్ ఇడి జాన్సీరాణి, డియఫ్ఓ నాగేశ్వరరావు, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.


