దిగుబడులు తగ్గనున్నాయా?
గత రెండు వారాల్లో మాన్సూన్ వర్షపాతం సాధరణం కంటే 15 శాతం అధికంగానే పడటంతో ఈ సీజన్లో వర్షాలు ఇక లేవేమోనన్న భయం నుంచికాస్త తెరిపి పడి అటు రైతన్నలు, ఇటు ప్రభుత్వ వర్గాలు ధైర్యం పుంజుకుంటున్నారు. ఐనా ఇది జూన్ -1 నుండి, జులై 22 వరకు గల కాలానికి, సాధారణం కన్నా 19 శాతం తక్కువగా నమోదరున విషయం గమనార్హం. గత వారంలోని అధిక వర్షపాతం దేశంలోని రిజర్వాయర్లను 23 శాతం కెపాసిటీని(జల సామర్ధ్యం) నింపేసారు. గతవారంలో 14శాతాం కెపాసిటి నీళ్ళు ఉన్నారు.
దీనివల్ల హైడ్రోపవర్ జెనెరేషన్(జల విద్యుత్ తయారి) కూడా పెరుగుతుందని అంచనా. గుజరాత్, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో తగినంతగా వర్షపాతం ఉండటంతో అక్కడ పత్తి, నూనెగింజల పంటలు మొదలౌతాయని భావిస్తున్నారు. చెరకు పండించేందుకు మాత్రం ఇక్కడ అనువుగా లేనట్టే! అలాగే చెరకు పంట పండించే ఉత్తరప్రదేశ్‌లోనూ, వర్షపాతం చాలా తక్కువగా ఉండటం వల్ల ఆ రాష్ట్రంలో పరిస్థితి బాగోలేదు. దీనివల్ల ప్రథమస్థానంలో ఉండే ఉత్తర్‌ప్రదేశ్ చెరకు ఉత్పత్తి 11 శాతం పడిపోతుందని ప్రభుత్వవర్గాలు చెబ్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే, చెరకు పంట 1,22,000 హెక్టార్లు తక్కువగా ఉండబోతోందని శరద్ పవార్ పార్లమెంటుకు తెలియజేశారు.
చెరకు పండించే మరో పెద్ద రాష్ట్రం మహరాష్ట్ర. గత పది రోజుల్లో ఇక్కడ వర్షాలు బాగానే పడ్డారు. జలాశయల్లో నీటిమట్టాలు పెరిగారు.గత నెలలో 20శాతం ఉన్న కృష్టా వ్యాలీలో కూడా, ఇప్పుడు 50 శాతం జలాలతో ఉన్నారు. కృష్ట వ్యాలీ ప్రాంతంలో, సాధారణం కంటే 53 శాతం అధికంగా వర్షపాతం నమోదరునట్ట వాతావరణ గణాంకాలు చెబ్తున్నారు.కొయన, ధోం, రాధానగరి జలాశయాలలో 70, 50మరియు 92 శాతం నీరు నిల్వలు చేరారు. నీరు అధికంగా కావాల్సిన చెరకు పంటను మహరాష్ట్రంలోని రైతులు డాములు మీద ఆధారపడి, మాన్సూన్ సీజన్ తర్వాత వేస్తుంటారు.
అరుతే, జులై 20 లెక్కల ఆధారంగా – 42వేల హెక్టార్లవిస్తీర్ణంలో చెరకుపంటని ఆపేయగా, మొత్తం 747 వేల హెక్టార్లలో చెరకు పండించనున్నారని తెలుస్తోంది. వర్షాభావ భయంతో, గత నెల్లో షుగర్ ఇండస్ట్రీ ఉత్పత్తి అంచనాలను 20 మిలియన్ టన్నుల నుంచి తగ్గించి, 17.5-18.5 మిలియన్ టన్నులుగా ప్రకటించింది. గత సంవత్సరం మన దేశం నికరంగా చక్కెర దిగుమతుదారుగానే ఉంది. ట్రేడర్ల అంచనాల మేరకు, చెరకు ఉత్పత్తి గణనీయంగా (45 శాతం) పడిపోతుంది. మొత్తం 14.7 మిలియన్ టన్నులకు చేరుతుందని వారు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా విదేశీ సంబంధాలలో భాగంగా ఎగుమతి చేసే గోధుమలను, బియ్యాన్ని ఈ సంవత్సరం చేయలేమని ఆయన పార్లమెంటులో అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్, బీహార్లలో పంటలు గణనీయంగా పడిపోతున్నందున్న, ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మొక్కజొన్న (కార్న్) పంటలో ముందజలో ఉండే బీహార్ రాష్ట్రంలో మాన్సూన్ వర్షాలు అంతగా పడలేదు. ఏదేమైనా – ప్లానింగ్ కమిషన్ మాత్రం వచ్చే రెండువారాలను కూడా పరిగిణించిగానీ, వర్షం- పంటల పరిస్థితి మీద ఏ విషయం నిర్ధారణగా చెప్పలేమంటోంది. కాగా, ఒకవేళ మాన్సూను కాలంలో వర్షపాతం తగ్గితే, ఆహార భద్రతను సమకూర్చే కార్యకలాపాలు కుంటుపడవచ్చు. అప్పడు నిరుపేదలకు ఆహారం ఎలా అందించగలం అనేది అసలు సమస్య. పైగా, యూపీఏ ప్రభుత్వం ప్రజలందరికీ ఆహార భద్రత విషయమై ఒక చట్టం తెచ్చే ఉద్దేశ్యంలో ఉన్న తరుణమిది.
గ్రామంలోనైనా, పట్టణంలోనైనా, దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రతి కుటుంబానికి, కిలో మూడు రూపాయలకే, నెలకు 25 కిలోల బియ్యం గానీ,గోధుమలు గానీ అందించే విధంగా ఓ కొత్త చట్టం తేవాలన్నది ముఖ్య యోచన. అందుకని, మన వ్యవసాయం వర్షాల మీద తక్కువగా ఆధారపడే విధంగా మార్చాలని మంత్రిత్వశాఖ ప్రయత్నిస్తోంది. ఈ ఆహార భద్రత కార్యక్రమాలలో విజయం సాధించాలంటే, వ్యవసాయ రంగాన్ని సమూలంగా మార్చాలి అంటున్నారు ఓ సీనియర్ ప్రభుత్వాధికారి. వ్యవసాయోత్పత్తి పెరగకపోతే, ఫ్రభుత్వం ఖచ్చితంగా మాట నిలబెట్టుకోలేదు” అనేది ఆయన వాదం. అందుచేత ఓ అగ్రికల్చరల్ స్టిమ్యులస్ ప్యాకేజి (వ్యవసాయ ఉద్దీపన)కోసం, మంత్రిత్వ శాఖ కోరాలనేది ఆయన చెప్పే మాట. అందుకనే, ఈ వాతావరణ సూచనల ద్రుష్ట్యా ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర యంత్రాంగాలను సమాయుత్తపరుస్తోంది.
ప్రాంతాలవారీగా పునః సమీక్షించి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో సంప్రదించి, రైతులకు సరియైన సమయంలో సలహానందించవలసిందింగా, రాష్ట్ర వెదర్ వాచ్ గ్రూపులను వ్యవసాయ శాఖ, గురువారం జరిగిన సమావేశంలో కోరింది. పంటల పరిస్థితులపై మీడియా సహాయంతో సమాచారం అందించాలనీ కోరింది. ఒక ప్రత్యేక హెల్ప్‌లైన్ – ఫోను నంబరును ఏర్పరచాలని, తద్వారా వివిధ పరిస్థితులకు అనుగుణంగా, తమ తమ రాష్ట్ర రైతులకి ప్రత్యామ్నాయ వ్యవసాయ సూచనలను/సాగు పద్ధతులను తెలియజేయాలని కోరింది. అగ్రికల్చర్ టెక్నాలజీ మ్యానేజ్మెంటు ఏజెన్సీ నుంచి, కావల్సిన ఆర్ధిక వనరులు అందిచవచ్చని తెలిపింది.


