దుమ్ములేపిన ‘ఆర్ఆర్ఆర్’
- 123 Views
- admin
- October 6, 2020
- Home Slider సినిమా
యుంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. ఇటీవలే హైదరాబాద్‌లోని అల్యూ మినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించింది. షూటింగ్ పునః ప్రారంభం కావడంతో ‘వియ్ ఆర్ ఆర్ ఆర్ బ్యాక్’ అంటూ ఓ వీడియో చేసింది. ఈ వీడియోలో ఏడు నెలలుగా క్లోజ్ చేయబడి ఉన్న సెట్స్‌లో టీమ్ మొత్తం అడుగుపెట్టినట్లు.. సినిమా షూటింగ్ కి సంబంధించిన ప్రాపర్టీస్‌ని కాస్ట్యూమ్స్ – తుపాకులు – కార్లకు పట్టిన దుమ్మును దులుపుతున్నట్లు చూపించారు. అలానే సెట్స్‌లో కరోనా గురించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చూపించారు. చివరగా రాజమౌళి యాక్షన్ చెప్పగా హీరోలు ఒకరు గుర్రం మీద.. ఒకరు బైక్ మీద దూసుకొస్తున్నట్లు వీడియోలో చూపించారు. ఏదేమైనా ఎన్నాళ్ళో వేచిన తరుణం వచ్చేసిందంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో అలియా భట్ – అజయ్ దేవగన్ – శ్రియా శరణ్ – ఒలివియా మోరిస్ – అలిసన్ డూడీ – రే స్టీవెన్సన్ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో ‘ఆర్.ఆర్.ఆర్’ ను నిర్మిస్తున్నాడు.కాగా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఇంట్రో వీడియో ‘రామరాజు ఫర్ భీమ్’ అక్టోబర్ 22న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.


