దేశవ్యాప్తంగా మరింత పెరిగిన చలి
- 96 Views
- wadminw
- January 2, 2017
- Home Slider రాష్ట్రీయం
తెలంగాణ, ఆంధప్రదేశ్తో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో చలి పులి విజృభిస్తోంది. రోజురోజుకూ ఉష్ణ్రోగ్రతలు పడిపోవడంతో చలి చంపేస్తోంది. ప్రజలు చలితో గజగజలాడుతున్నారు. ప్రధానంగా వృద్ధులు మృతి చెందుతున్నారు. చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారు. అనేక ప్రాంతాల్లో పొగ మంచు దట్టంగా పరుచుకోవడంతో రవాణా స్తంభించి ఇబ్బందులు పడుతున్నారు.
పలు విమాన, రైల్వే సర్వీసులు కూడా రద్దయ్యాయి. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 6డిగ్రీల వరకు తగ్గితే విపరీతమైన చలిగాలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యల్పానికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం చలితో వణికిపోతోంది.
రెండు రోజులుగా విశాఖ జిల్లా లంబసింగిలో 0 డిగ్రీలు, ఆదిలాబాద్ పట్టణంలో 4 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండ, రామగుండం, కళింగ పట్నాల్లో సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణ జిల్లాల్లో చలిగాలులు వీస్తుండడంతో అక్కడ జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు కంటే తక్కువ ఉంటోంది.
ఆంధ్రప్రదేశ్లో కూడా చలి తీవ్ర పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచుతో రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాయలసీమలో మాత్రం సాధారణ కంటే ఒక డిగ్రీ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయవాడలో సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రత 19 డిగ్రీల నుంచి శుక్రవారం 15 డిగ్రీలకు పడిపోయింది. హైదరాబాద్లో 3 డిగ్రీలు తగ్గిపోయి 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
తీర ప్రాంతాలైన విశాఖపట్నం, కాకినాడ, బాపట్ల, కళింగపట్నాల్లో చలి తీవ్ర పెరిగింది. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి చలిగాలులు తెలంగాణ, కోస్తావైపునకు వీస్తుండడంతో ప్రజలు గజగజలాడుతున్నారు.


