ధనిక ముఖ్యమంత్రి పాలనలో ఉన్న పేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
- 28 Views
- admin
- February 1, 2023
- తాజా వార్తలు
దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి పాలనలో ఉన్న పేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారుదేశంలోనే సీఎం జగన్ క్లాస్ వేరంటూ వరుస ట్వీట్లతో ఎద్దేవా చేశారు. అరకులో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి కామ్రేడ్ చారు మజుందార్, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి . కామ్రేడ్ పుచ్చలిపల్లి సుందరయ్య వంటి ‘క్లాస్ వార్’ గురించి మాట్లాడుతున్నారు. ఇదేం చోద్యం’ అని పవన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల జీవితాలు, గౌరవం, కష్టం వంటివి కొంతమందికి అమ్ముడుపోయాయని, మధ్యతరగతి కుటుంబాలు రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అన్నారు. వైసీపీ వారిని పన్ను చెల్లించే వారిగానే చూస్తోందన్నారు.
Categories

Recent Posts

