నందమూరి అభిమానులకు దసరా కానుక!
నందమూరి నట సింహం బాలకృష్ణ 100వ సినిమాగా వస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయినట్టే. సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న ఈ సినిమా దసరా కానుకగా బాలయ్య బాబు తన అభిమానులకు టీజర్ గిఫ్ట్‌గా ఇస్తున్నాడు. అక్టోబర్ 11న ఉదయం 8 గంటలకు శాతకర్ణి టీజర్ రిలీజ్ చేస్తున్నారట. ఇక అక్టోబర్ 9న సినిమాలోని మరో లుక్ రిలీజ్ చేస్తారట. క్రిష్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా రాజీవ్ రెడ్డి, సాయి బాబులు నిర్మిస్తున్నారు. శ్రీయా శరణ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు దర్శక నిర్మాతలు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్‌లో కూడా ఈ సినిమా బాలయ్య కెరియర్లో బెస్ట్‌గా నిలిచింది.
కాగా, తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోసిన నటులు ఎన్టీఆర్ ఒక్కరే. ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న బాలకృష్ణ ఫ్యాక్షన్ తరహా చిత్రాలకు ప్రాణం పోశారు. యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తూ సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బ్లస్టర్స్తో రికార్డులు క్రియేట్ చేశారు. తాజాగా బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణీ చిత్రం తెరకెక్కిస్తున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి (లేక శాలివాహనుడు) (క్రీ.పూ. 78-102) శాతవాహన రాజులలో 23వ వాడు. అతని తండ్రి శాతకర్ణి తరువాత రాజయ్యాడు. శాతవాహన రాజులందరిలోకి గొప్పవాడిగా పేరొందాడు.
అతడి తండ్రి శాతవాహనుడు అశ్వమేధ యాగం చేసి రాజ్యాన్ని విస్తరించాడు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్, టీజర్ వచ్చేస్తున్నాయి. బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి లుక్‌ను ఈనెల 9 న విడుదల చేయనున్నారు. మరో శుభవార్త ఏంటంటే ఈ నెల 11న ఉదయం 8 గంటలకు ఈ చిత్రానికి సంబందించిన టీజర్‌ను కూడా విడుదలచేయనున్నారు. బాలకృష్ణే టీజర్, ఫస్ట్ లుక్ విడుదల తేదీలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కంచె లాంటి బ్లాక్ బ్లస్టర్ చిత్రాన్ని అందించిన క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తుండగా రాజీవ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శ్రీయ, హేమమాలిని ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.


