నందమూరి నటసింహం ఫ్యాన్స్ కు రైతు షాక్!?
ప్రస్తుతం వందో సినిమా గౌతమిపుత శాతకర్ణి విషయంలో ఫ్యాన్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో బాలయ్య తన 101వ సినిమాగా చేయబోతున్న రైతు సినిమా మీద కాస్త కంగారుగా ఉన్నారు. ఎందుకు అంటే రైతు సినిమాలో బాలయ్య కేవలం ఓ రైతుగా మాత్రమే కనిపిస్తారట. అంటే అందులో హీరోయిజం చూపించే సన్నివేశాలు కాని హీరోయిన్స్‌తో రొమాంటిక్ సీన్స్ కాని ఇవేవి ఉండవని టాక్. బాలయ్య అంటేనే హీరోయిజం. అసలు తొడగొట్టి శతువు గుండెల్లో నిద్ర పోయే బాలయ్య బాబు అసలు అలాంటి సీన్సే లేకుండా సినిమా చేస్తే ఊహలకు అందట్లే కదా ప్రస్తుతం రైతు సినిమా అంతే చేయబోతున్నారట. కృష్ణవంశీ డైరక్షన్లో చేయబోతున్న ఈ సినిమాను బాలయ్య చాలా ప్రెస్టిజియస్‌గా నటించాలని ఫిక్స్ అయ్యారట. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా పూర్తి చేసుకుంటున్న బాలకృష్ణ త్వరలోనే రైతు సినిమా షూట్లో పాల్గొననున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్రలో బిగ్ బి అమితాబ్‌ను కూడా తీసుకున్నారని తెలుస్తుంది. సో ఈ కారణాలన్ని చూస్తుంటే సినిమా ఏ రేంజ్‌కు వెళ్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఫ్యాన్స్‌కు ఈ వార్తలన్ని బూస్టప్ ఇస్తున్నా బాలయ్య సినిమాలో రొమాన్స్ గట్రా లేకుంటే కాస్త నిరాశ చెందే అవకాశం ఉంది. మరి కృష్ణవంశీ ఎలా రైతు సినిమాను తెరకెక్కిస్తారో చూడాలి. ప్రస్తుతం కృష్ణవంశీ డైరక్షన్లో వస్తున్న నక్షత్రం సినిమా పూర్తి కాగానే ఇక రైతు సినిమా మీదా దృష్టి పెట్టనున్నారు. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా రాబోతున్న బాలయ్య రైతు మూవీ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. సినిమా ఇండస్ట్రీలో ఒక్కో సారి కొన్ని కాంబినేషన్లు చూస్తుంటే నిజంగా ఇలా జరుగుతుంటాయా? అన్న అనుమానాలు వస్తుంటారు. ఒకప్పటి చిత్రల్లో పెద్ద హీరోలు సైతం ఒకే చిత్రంపై కనిపించి కనువిందు చేసేవారు. కొంత కాలానికి మల్టీ స్టారర్ చిత్రాలు రావడం తగ్గిపోయాయి. ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ చిత్రాలు కూడా బాగానే వస్తున్నాయి. ఆ మధ్య సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల లాంటి మల్టీ స్టారర్ చిత్రాలు కూడా బాగా అలరించాయి. ఇక తెలుగు ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత బాలయ్య క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశి దర్శకత్వంలో నటించబోతున్నారు. ఈ చిత్రానికి రైతు అని ఖరారు చేశారు. రీసెంట్గా మరోసారి ఆ విషయం కన్ఫామ్ అయింది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో సర్కార్-3షూటింగ్లో పాల్గొంటున్న అమితాబ్ బచ్చన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమితాబ్‌ను బాలయ్య,కృష్ణవంశీ కలవడమే కాకుండా వర్మ కూడా ఉన్నారు. డిసెంబర్లోనే రైతు సెట్స్ మీదికి వెళ్తుందని కృష్ణవంశీ నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. మరో వైపు బాలయ్య-కృష్ణవంశీ కలిసి అమితాబ్ బచ్చన్‌ను కలవడానికి ప్రత్యేక కారణం ఉండొచ్చన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. రైతు చిత్రంలో అమితాబ్‌ని ప్రత్యేక పాత్రలో నటింపజేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కథ బ్రీఫింగ్ ఇవ్వడం కోసం కృష్ణవంశీని వెంట తీసుకెళ్లినట్లుగా చర్చించుకుంటున్నారు. ఆ సంగతెలా ఉన్నా బాలయ్య- అమితాబ్-వర్మ-కృష్ణవంశీలను ఒక ఫ్రేమ్‌లో చూడటం జనాలకు మంచి అనుభూతినిచ్చింది. మొత్తానికి ఈ కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం మంచి క్రేజ్ రావడం ఖాయమంటున్నారు.


