నకిలీ పాల తయారీ కేంద్రంపై పోలీసుల దాడి
గుంటూరు జిల్లా నరసరావుపేట లలితాదేవి కాలనీలో నకిలీపాల తయారీ కేంద్రంపై ఉదయం పోలీసులు దాడిచేశారు. ఈ సందర్బంగా 600 లీటర్ల పాలు, ఆయిల్, పాలపొడిని స్వాధీనం చేసుకున్నారు. డిపో నిర్వాహకులు బాలకొటయ్య, శ్యామల శ్రీనివాసరెడ్డితో పాటు మరో ఇద్దరిని రెస్ట్ చేశారు. కాగా, ఆటో, కారు ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన జరిగింది.
మాచర్ల మండలం కొత్తూరు గ్రామానికి చెందిన వడితె అంజినాయక్ (29) మాచర్ల నుంచి సాగర్ వైపు ఆటోలో వస్తుండగా, ఎదురుగా వస్తున్న కారు తాళ్లపల్లి సమీపంలో ఢీకొట్టడంతో 11 మంది గాయపడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న అంజినాయక్ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
Categories

Recent Posts

