నచివాలయంలో సీఎం సందడి
- 69 Views
- wadminw
- October 12, 2016
- రాష్ట్రీయం
అమరావతి, అక్టోబర్ 12 (న్యూస్టైమ్): అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో తన కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనదైన మార్కు సమీక్షలను తొలిరోజు నుంచే ప్రారంభించారు. ప్రజలకు సేవచేసేందుకు ఆర్ధిక సాధికారిత కల్పించేందుకు రాజకీయాలు ఉపయోగపడాలని, అదే ధృడ విశ్వానంతో వెలగపూడి నుంచి రాష్ట్ర పాలన ప్రారంభించనున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం వెలగపూడి సచివాలయంలో తన కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసూ ప్రతి కుటుంబానికి కనీసం నెలకు పదివేల ఆదాయం సమకూర్చే విధంగా పరిపాలన కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమం, అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వానికి ప్రజలు సంఘిభావం ప్రకటించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పరిపాలనలో నేటి నుంచి నూతన శకం ఆరంభమైందన్నారు.
ప్రస్తుతం పూర్తికానోస్తున్నపనులు నెలాఖరు నాటికి పూర్తవుతున్న కారణంగా ఈ నెలాఖరునాటికి పూర్తిస్థాయి పరిపాలన వెలగపూడి సచివాలయం నుంచే నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ 10 యేళ్ళవరకు ఉమ్మడి రాజధానిగా ప్రకటించినందున అక్కడ పరిపాలనకు అనువగా సచివాలయాన్ని మార్పు చేశామన్నారు. అయితే ప్రజల మధ్యనుండి, వారి ఆమోదం మేరకే పనిచేయకపోతే, ఆశించిన పలితాలు రావని తాము భావించామన్నారు. ఆందుకే తమ ప్రభుత్వపరిపాలనా యంత్రాంగాన్ని రెండున్నర యేళ్ళకాలంలోనే రాష్ట్ర రాజధానికి మార్చడం జరిగిందన్నారు.
కేవలం ఒక గంట వ్యవధిలో జరిగే సమీక్షసమావేశాలకు హైదరాబాద్ నుంచి వచ్చివేళ్ళేందుకు ఒక రోజు సమయం కార్యదర్శులు, వివిధ స్థాయి ఆధికారులు నష్టపోవడం జరిగేదన్నారు. ఇవన్నీ దృష్టిలో వుంచుకొని శాశ్వతంగా నిర్మించిన భవనాల్లో తాత్కాలికంగా సచివాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. అమరావతి రాజధానిని ప్రపంచ ప్రఖ్యాత నగరాల సరసన చేర్చే స్థాయిలో నిర్మించేందుకు కొంత కాలం అవసరమవుతున్న ధృష్ట్యా ఈ నిర్ణయం చేశామన్నారు. కేవలం 8 నెలల కాలంలోనే ఆనుకొన్నరితిలో భవనాలు నిర్మించడం శుభపరిణామమన్నారు.
భవనాలు నిర్దేశించిన కాలానికి పూర్తికాలేదనడం సరికాదని, భవనాలు, మౌలికసదుపాయాలు కల్పించేందుకు, వాటిని నాణ్యతలు కూడి పూర్తిచేసేందుకు ఒక లక్ష్యం ఎప్పటికీ అవసరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాలపరిమితిని నిర్ణయించని ఏ పని ప్రగతినీ సమీక్షించడం వీలుకాదన్నారు. అందువల్ల అన్ని పనులకు కాలపరిమితిని తాము నిర్దేశిస్తుంటామని, అనుకున్న వ్యవధిలోనే చాలా పనులు పూర్తిచేయడం జరిగిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. కాగా, రాష్ట్రంలోని డ్యాక్రా మహిళలకు పెటుబడి నిధి రెండవ వాయిదా ఒక్కొక్కరికి రూ.3 వేల వంతున విడుదల చేస్తూ సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఇందుకు రూ.2,500 కోటు విడుదల చేసూ తొలి సంతకం చేయడం జరిగిందన్నారు. మహిళా సాధికారిత కోసం డ్యాక్రా సంఘాల స్థాపన, ఆర్ధిక కార్యకలాపాలు తాము ప్రారంభించిన సంగతి ముఖ్యమంత్రి గుర్తుచేశారు. డ్యాక్రా మహిళలకు పెటుబడి నిధి క్రింద రూ.10 వేలు అందిస్తామని తాము ఇచ్చిన హామీ మేరకు తొలివిడత రూ.3వేలు. రెండో విడతలో భాగంగా ప్రసుతం మరొక రూ 3 వేలు విడుదల చేశామన్నారు. తాము ఇచ్చిన హామీ మేరకు డ్యాక్రా మహిళలకు మరొక రూ.4 వేలు విడుదల చేయాల్సి ఉందన్నారు డ్యాక్రా మహిళలకు రూ.12 వందల కోటు రుణం మాఫీ చేశామన్నారు. భారతీయ సమాజంలో తరతరాలుగా కొనసాగుతున్న లింగ వివక్షను తొలగించి, మహిళలకు ఆర్ధిక భద్రతను, సాధికారితను కల్పించేందుకు తాము కృషిచేస్తున్నామన్నారు.


