నమ్మాలనుకున్నా నమ్మలేని నిజాలు!
ప్రపంచమంతా కలిపి 100కు పైగా వివిధ రకాల కాకులు ఉన్నాయి. ఇవి చాలా తెలివైన పక్షులు. చేతిలో తుపాకీ పట్టుకున్న వ్యక్తిని గుర్తుపడతాయి. పులి తన శరీర బరువులో 5వ వంతు ఆహారాన్ని ఒక్కపుటలో తినేస్తుంది. స్రుష్టిలోని జివరాసులలో కెల్లా అత్యంత భారీ బిడ్డను కనే జంతువు తిమింగళo. జమైకా ద్వీపంలో 120 నదులున్నాయట. సెల్ ఫోన్ వాడకంలో ‘నోకియా’ మనకు బాగా పరిచయమైంది. ఫిన్లాoడ్లోని ఓ ప్రదేశం.ఆ పేరు మీదనే బ్రాండ్ ఏర్పడింది. బ్రెజిల్ దేశం దక్షిణ అమెరికా ఖండంలో సగభాగంలో విస్తరించింది. దేహంలో ఉండే ఏముకల్లో పావువంతు పాదాల్లోనే ఉంటాయి.
ప్రాణులను కుట్టి రక్తం పిల్చేది ఆడ దోమలు మాత్రమే. ఇంగ్లీష్ భాషలో అత్యంత పురాతనమైన పదం ‘టౌన్’. ఈఫిల్ టవర్‌లో మొదటి అంతస్తుకి 347,2వ అంతస్తుకి 674 మేట్లుంటాయి. చిన్న చిన్న ఫ్లాట్ ఫామ్‌లన్నీ కలిపి 1710 మెట్లుoటాయట. జిరాఫి నాలుక 21 అంగుళాల పొడవు ఉంటుందట. అది నాలుకను చాచి చెవుల్ని శుభ్రం చేసుకుంటుంది. నిమ్మకాయల్లో చెక్కర ఉండదు అనుకుంటాం కానీ స్ట్రాబెర్రీల కంటే నిమ్మకాయల్లోనే ఎక్కువ చక్కర ఉంటుందట. ఒలంపిక్ పతాకాన్ని 1914లో బరోన్ పియరె డి కౌబెర్టిన్ తయారుచేసారు.
ప్రయాణికుల రవాణాలో ప్రపంచంలోనే అతి పెద్ద గాలిమోటర్ ఎయిర్ బస్ కంపెనికి చెందిన ఎ-380 విమానమే. ఇందులో మొత్తం 853 మంది ప్రయాణించేందుకు వీలుంటుంది. కాఫీ పుట్టింది ఇధియోపియాలోని కఫ్ఫా అనే ప్రాంతంలోనే. కల్ది అనే కాపరి తన మేకలు కాఫీ మొక్కల్ని తిని ఉత్సాహంతో గంతులువేయడం గమనించి వీటిని గుర్తించాడు. న్యూజిలాండ్‌లో 4 మిలియన్ల ప్రజలుoటే, అక్కడ గొర్రెల సంఖ్య 70 మిలియన్లు.
క్యారెట్లలో కొవ్వు పదార్ధాలు అసలే ఉండవు. సున్నా శాతం కొవ్వు. వేడినీటిలో టీ బ్యాగ్ వేసుకోవడం అత్యాధునికం అనుకుంటున్నాం కదా! టీబ్యాగ్ తయారై 100 ఏళ్ళు దాటింది. నిజం మెదటి 1908లో తయారైందట.
సగటు మనిషి తన జీవితంలో భూమిని 5సార్లు చుట్టి వచినoత దూరం నడుస్తాడట. తాజ్ మహల్‌ను ఏడాదికి 70 నుంచి 80 లక్షల మంది టూరిస్టులు సందర్శిస్తారట. ఉడుత జీవితకాలం కేవలం తొమ్మిదేళ్ళు. అండర్‌గ్రౌండ్ పదాన్ని గమనించండి అండ్తో మొదలై అండ్తోనే పూర్తవుతుంది. ఈము పక్షి వెనక్కు ఒక్క అడుగు కూడా వేయలేదు. ఈ పక్షులు వెనక్కు నడవలేవు. నీరు ద్రవరూపంలో ఉన్నప్పటి పరిమాణం కంటే గడ్డకట్టినపుడు 9 శాతం పెరుగుతుంది. ప్రతి 2 గంటలకు ఒక ఇంగ్లీష్ పదం డిక్షనరీలో చేరుతుంది.
అమెరికన్లు ఒక రోజులో తినే పిజ్జాలను నెలమీద పరిస్తే 100 ఎకరాల స్థలం ఆక్రమిస్తాయట. కుక్క జీవితకాలం 10-14 సంవత్సరాలు మాత్రమేనట. ప్రపంచంలో మొత్తం 54 రకాల కోకిలలు ఉన్నాయి. మగ కోకిలలు పాడలేవట. కూ’ న్న కూత పెట్టేది కేవలం ఆడకోయిలలే. యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌లో సైన్స్, మాథ్స్ తప్ప అన్ని సబ్జెక్ట్‌లలో ఫెయిల్ అయ్యారట మన ఐన్ స్టీన్. నీరు త్రాగకుండా ఉండే జంతువు అనగానే ఒంటె గుర్తొస్తుంది కానీ జిరాఫీ,ఎలుకలు అంతకంటే ఎక్కువ రోజులు నీటిని తాగకుండా జీవించిగలుగుతాయట. క్యాన్సర్ వ్యాధి బారిన పడని జంతువు షార్క్ చేప ఒక్కటేనట. నీళ్ళు ఉన్న విషయాన్ని ఏనుగులు 3 మైళ్ళ దూరం నుండే పసిగడతాయట.
ఎలుగుబంటిని చూసి మనం భయపడతాం కానీ ఎలుగుబంటి మాత్రం పిల్లిని చూస్తే భయంతో వణుకుతుందట. 95 శాతం మంది అధిక బరువుతో ఉండటం వల్ల నౌరు దేశాన్ని ఫ్యాటెస్ట్ నేషన్‌గా పిలుస్తారు. ఆవులు కనుగుడ్లను అన్ని వైపులకు గుండ్రంగా తిప్పగలవు. రోజుకు 35 గ్యాలన్ల(1 గ్యాలన్=3.8 లీటర్లు) నీరు తాగుతాయి. షూ లేసుకు రెండు చివర్లా ఉండే చిన్న ప్లాస్టిక్ ముక్కలను అగ్లేట్స్ అంటారట!
ఉష్ట్రపక్షి(అస్ట్రిచ్)చిన్నప్రేగు 46 అడుగుల పొడవుoటుoదట! మనం తేనెను తాగితే 20నిమిషాల్లో అది రక్తంలో పూర్తిగా కలిసిపోతుందట! మొదటిసారి కెమెరాను కనుక్కున్నప్పుడు ఒక ఫోటో తీయించుకోవడానికి 8 గంటలు కుర్చోవాల్సి వచెదట! పిచ్చుకలు కేవలం 14-16 సెంటీమీటర్ల ఎత్తు, 27-39 గ్రాముల బరువు కలిగివుండి, గంటకు 24 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయట! ప్రపంచంలో టీవీలు అత్యధికంగా ఉన్న దేశం చైనా. అక్కడ దాదాపు రెండు వందల మిలియన్ల టీవీలు ఉన్నాయట! క్యారెట్లు మరీ ఎక్కువగా తింటే చర్మం ముదురు పసుపు రంగులోకి మారుతుందట. దీనిని కేరొటెనేమియా అంటారు! బార్బీ డాల్ పూర్తి పేరు బార్బారా మిలిసెంట్ రాబర్ట్!
అమెరికాలోని న్యూజెర్సీలో ఆదివారం నాడు క్యాబేజీలు అమ్మకూడదనే చట్టం ఉందట! మగ హిప్పోపోటమస్‌ను బుల్ అనీ, ఆడదాన్ని కౌ అనీ, పిల్లలను కాఫ్ అనీ అంటారు! మన దేహంలో ఎక్కువ ముడతలు పడి ఉండే భాగం మెదడు. దానిని విడదీసి పరిస్తే దిండు మేర విస్తరిస్తుంది.
సింహాలకు చూపు రాత్రిళ్ళు చాలా చురుగ్గా ఉంటుంది. మనుషుల పగటి చూపుతో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ. తల్లిపాలలో ఉండే పోషకాలన్నిoటిని కలిగి ఉన్న ఆహారం ప్రపంచంలో మరొకటి లేదు. ప్రపంచంలో అత్యధికంగా విద్యార్ధులు చదువుకుంటున్న పాఠశాల లక్నోలోని సిటీ మాంటిస్సోరి స్కూల్. అందులో 45 వేలకు పైగా విద్యార్ధులు చదువుకుంటున్నారు.
మహిళలు పురుషుల కంటే 2 రెట్లు ఎక్కువగా కనురెప్పలు కొడతారట! అరటిపళ్ళలో విటమిన్ సీ, బీలతో పాటు పోటాషియం కూడా అధికంగా ఉంటుందట! పొద్దున్న లేచిన వెంటనే కాఫీ తాగటం కంటే ఒక యాపిల్ తింటే బద్దకం త్వరగా వదులుతుందట! క్యాబేజీ రసం తాగితే పేగుల్లో ఏర్పడిన పుండ్లు నయమౌతాయట! టమాటాలో ఉండే లైకోపిన్ అనే పదార్ధం ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది! ఫలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పోమాలజీ అంటారు. 1982లో కంప్యూటర్ను ప్రముఖ టైమ్ మ్యాగజైన్ మ్యాన్ అఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది.
అలారం కనిపెట్టిన కొత్తలో ఉదయం 4 గంటలకు మాత్రమే అలారం పెట్టుకునే సౌకర్యం ఉండేదట! ఇటలీ భాషలో టమాటోని పొమొడొరో అంటారట! జామపండులో విటమిన్ ‘సీ’ కమలాపండు కంటే 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సీతాకోకచిలుకలు మరీ ఎక్కువ దూరం చూడలేవు. కేవలం పది నుంచి పన్నెండడుగుల దూరంలో ఉన్న వాటిని మాత్రమే చూడగలుగుతాయి! షేక్ స్పియర్ నాటకాల్లో దాదాపు 13 నాటకాల్లోని పాత్రలు ఆత్మహత్య చేసుకున్నాయి! ప్రపంచంలోని మిలియనిర్లలో 80 శాతం మంది సెకండ్ హ్యాండ్ కార్లు వాడుతున్నారని ఒక సర్వేలో తేలిందట!
ఖడ్గమ్రగానికి కోపమొస్తే దాని చెమట ఎరుపు రంగులోకి మారిపోతుందట! ఎప్పుడైనా గమనించారా? యాపిల్ పండు నీళ్ళలో మునగదు. ఎందుకంటే అందులో 25 శాతం గాలే ఉంటుంది. గొడుగును ఈజిప్ట్‌లో క్రీ.పూ.3500 ఏళ్ళ కిందట ఉపయోగించారు. అప్పట్లో వాళ్ళు ఎండకు రక్షణగా తాటాకు గొడుగును వాడేవారు. పొగ తాగే అలవాటున్నవారు, సాధారణ చురుకుదనం పొందడానికి మామూలు కంటే ఒక గంట ఎక్కవ నిద్ర అవసరమౌతుందట! ఒక్క నారింజ విత్తనం నుండి ఒక్కోసారి ఒకటికంటే ఎక్కువ మొక్కలు మొలుస్తాయట!
తేనె త్వరగా ఎందుకు జీర్ణం అవుతుందో తెలుసా? అది అప్పటికే తేనేటిగ కడుపులో జిర్నమైపోయిన పదార్ధం కాబట్టి! మొనాలిసా చిత్రకారుడు లియోనార్డొ డావిన్సి ఒకేసారి ఒక చేత్తో రాస్తూ మరో చేత్తో పెయింటింగ్స్ వేయగలడట. పెట్రోలియం అనే పదం గ్రీకు భాష నుండి వచిన్ది. పెట్రో అంటే రాయి అని. ఓలియం అంటే నూనె అని అర్ధమట! ద్రాక్షపళ్ళ గింజలలో అత్యధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయట! అమెరికాలో నమోదయ్యే కేసుల్లో 50 శాతానికి పైగా యాక్సిడెంట్ కేసులేనట! అనకొండ ఎదుగుదల ఆగదు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. వీటి జీవితకాలం 10-12 ఏళ్ళు.కొన్ని 30 ఏళ్ళ వరకు కూడా జీవిస్తాయ. మనిషి ముక్కు 50 వేల రకాల పరిమళాలను గుర్తిస్తుంది.
అయితే కాలుష్యం బారిన పడి నాసికాపుటలు సున్నితత్వాన్ని కోల్పోకపోతేనే అది సాధ్యం. పుచ్చకాయలో అధికశాతం నీరే ఉంటుందన్నది తెలిసిందే. అయితే అందులో విటమిన్ సీతో పాటు, 6శాతం చక్కర కూడా ఉంటుందట! యుక్తవయసులో ఉన్న స్త్రీలు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే పాలి సిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ బారిన పడతారట! 1928లో మొదటిసారి కార్టూన్ బొమ్మల్లో, యానిమేషన్లలో ఎలుకను ప్రవేశపెట్టారు. దానిపేరే మిక్కీమౌజ్. దోమలు జీరో బ్లడ్ గ్రూప్ రక్కాన్నే ఎక్కువ ఇష్టంగా పిల్చేస్తాయట! ఆలివ్ చెట్లు సుమారు 3 వేల సంవత్సరాల వరకు జివిస్తాయట!
బీట్ రూట్‌ను మరిగించిన నీటితో తల రుద్దుకుంటే చుండ్రు తగ్గిపోతుందట! కెనడా అంటే పెద్ద గ్రామం అని అర్ధం.
శరీరంలో సరిపడేంత ఫోలిక్ యాసిడ్ లేకపోతే డిప్రెషన్‌కు గురౌతారట. పాలకూర తింటే ఆ సమస్యే రాదట. పిల్లి చెవిలో 32 కండరాలు ఉంటాయి. అందుకే అది చిన్న శబ్దాన్ని కూడా వినగలుగుతుంది. నిప్పు కోళ్ళు గుర్రాల కంటే వేగంగా పరిగెడతాయి. అంతేకాదు మగ నిప్పు కోళ్ళు సింహాల్లాగే గర్జిస్తాయి. ప్రపంచంలో ఎక్కువమంది ఆగస్టు నెలలో పుట్టినవారే. ప్రపంచంలో 11 శాతం మంది ప్రజలు ఎడమ చేతి వాటం వారే. ఏ రెండు మొక్కజొన్న కంకులు ఒకేలా వుండవు. టీ, కాఫీలో ఉండే కొన్ని రసాయనాలకు పోషకాలను హరించే శక్తి ఉందట. అందుకే భోజనం చేసిన వెంటనే వాటిని తాగవద్దంటారు వైద్యులు! ఈము పక్షులు నీళ్ళు అధికంగా తాగుతాయి. ఒక్కసారి తాగడం మొదలుపెడితే 10 నిమిషాల పాటు తాగుతూనే ఉంటాయి. మగాళ్ళు తమ జీవిత కాలంలో దాదాపు 3వేల గంటలు షేవింగ్‌కు కేటాయిస్తారు!
ప్రపంచంలో 70 వేల రకాల సాలీళ్లులున్నాయి! బంగాళదుంప ముక్కలను ఎముకలు విరిగినచోటు ఉంచితే. ఎముకలు అతుక్కోవడానికి దోహదపడుతుంది! ఆరోగ్యకరమైన ఆవు తన జీవితకాలంలో రెండు లక్షల గ్లాసుల పాలు ఇస్తుంది! 1666లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో లండన్ నగరం సగానికి పైగా తగలబడిపోయింది. కానీ ఆరుగురు మత్రమే గాయపడ్డారు! మిగిలిన జంతువులన్నిటి పాల కంటే ఒంటెపాలు తేలికగా జీర్ణమౌతాయి! ఒక్క కింగ్ కోబ్రాలో ఉండే విషం ముప్పై మంది ప్రాణాలు తీస్తుంది! మేక కనుపాపలు చతురస్రాకారంలో ఉంటాయి!
గొర్రెలకు జ్ఞాపకశక్తి ఎక్కువ ఒక 50 మంది మనుషులను వరుసగా చూపించినా అందరినీ గుర్తుపెట్టుకోగలవని పరిశోధనల్లో తేలింది! ఖడ్గమ్రగం శాకాహార జంతువు.దీని కొమ్ము బరువు 500-700 గ్రాములు. గర్భదారణ సమయం 15-16 నెలలు! సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరగడానికి యూరెనస్కి 84 ఏళ్ళు పడుతుంది. అంటే అక్కడ పగలు 42 గంటలు, రాత్రి 42 గంటలు ఉంటుందన్నమాట! చికెన్‌లో ఉండే అమైనో ఆమ్లము మ్యూకస్ ను బలపరుస్తుంది! మనం కొద్ది నిమిషాల్లో భోజనం చేసేస్తాం. కానీ అది పూర్తిగా జీర్ణం కావడానికి 12 గంటలు పడుతుంది!
అప్పుడే అరటిపండు తిన్న వ్యక్తికి దోమలు ఎక్కువగా ఆకర్షితమావుతాయట! చాలా వరకు పీతలు ముందుకు,వెనక్కి నడవగలవు. అంతేకాదు కొన్ని ఈత కూడా కొట్టగలవు! సోయాబీన్స్ ఎక్కువగా తీసుకునే స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది! మనం ఒక్క అడుగు వేయడానికి శరీరంలోని 200 కండరాలు కదలాల్సి వస్తుంది! 1845లో బ్రిటన్‌లో ఓ చట్టం వచ్చింది. దాని ప్రకారం ఆత్మహత్య ప్రయత్నం చేసినవాళ్ళకి మరణశిక్షవిధించేవారు! ఫ్రూట్ఫ్ ఫ్లై అనే కీటకానికి ఏదైనా ఇన్ఫేక్షన్ వస్తే, అది బాగా మద్యం సేవించి కడుపులోని ఆహారాన్ని బయటకు పంపించి తనని తాను రక్షించుకుంటుంది. నీటిమీద తేలే పోస్టాఫీసు మన దేశంలోనే ఉంది తెలుసా? కాశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో 2011లో దీన్ని ప్రారంభించారు. జిబ్రాలు నారింజ రంగును గుర్తించలేవు! ఆవు పాలలో కంటే మేక పాలలో క్రోవ్వు పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. అల్లం. ఉల్లి ఈ రెండు ఫ్లూ కారకాలను తరిమేస్తాయి! ఒక మనిషి తన జీవితకాలంలో దాదాపు 1,460 కలలు కంటాడు!
ఒంటెకు కోపమొస్తే గట్టిగా ఉమ్మేస్తుoది! మిగిలిన అన్ని గ్రహాలూ కలిపితే ఎంత ఉంటాయో, అంతకంటే పెద్దగా ఉంటుంది బృహస్పతి! మన నాలుకపై ఉండే రుచిమొగ్గల జీవితకాలం కేవలం 10 రోజులు మాత్రమే! డావించీ చిన్నప్పుడే డిస్లేక్సియా వ్యాధి బారిన పడడంతో అప్పుడప్పుడు అక్షరాలను వెనక నుండి ముందుకు రాస్తుండేవాడు! నత్త ప్రమాదవశాత్తూ కంటిని కోల్పోయినట్లయితే శాశ్వతంగా గుడ్డిదానిలా ఉండిపోదు.తిరిగి కొత్త కన్ను ఏర్పడుతుంది. మనకు గోరు ఉదిపోయినా తిరిగి వచ్చినట్టన్నమాట! ప్రపంచంలో ఉన్న లక్షలాది చెట్లు ఉడతల వల్లనే మొలిచాయి.
ఉడతలు పండును తిన్న తరువాత గింజను భూమిలో నాటుతాయి. గర్భంలో ఉన్న బిడ్డకు మూడు నెలలు వచ్చినప్పటి నుంచి ఫింగర్ ప్రింట్స్ తయారౌతాయి! వరల్డ్ వైడ్ వెబ్ అన్న మాటను 1990లో టీమ్ బెర్నర్స్ లీ కనిపెట్టాడు! ఇంటెర్నెట్లో మొట్టమొదటి కామిక్ వెబ్సైట్ డిల్బర్ట్ జోన్! ఆరోగ్యకరమైన మనిషి సంవత్సరంలో 62 లక్షల సార్లకు పైగా కళ్ళార్పుతాడు! మైక్రోఫోన్‌ను 1876లో ఎమిలీ బేర్లైనర్ కనుగొన్నాడు!


