నానికి కలిసివచ్చిన అదృష్టం
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్‌ని కైవసం చేసుకున్న హీరో నాని. కృష్ణగాడి వీర ప్రేమ గాథ, జెంటిల్ మెన్ వంటి వరుస విజయాల తరువాత ప్రస్తుతం నాని నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ మజ్నుపై ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే మజ్ను మూవీకి సంబంధించిన విషయంలో నానికి అదృష్టం కలిసి వచ్చిందంటూ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… మజ్ను మూవీకి అవుట్ సూపర్భ్ క్యాలిటీగా వస్తుందనేది ఇండస్ట్రీ రిపోర్ట్. పోస్ట్ ప్రొడక్షన్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం, నానికి మజ్ను మూవీ గ్రాండ్ సక్సెస్‌ని ఇస్తుందని అంటున్నారు. ఇప్పటికే మజ్ను మూవీకి సంబంధించిన ట్రైలర్లు, పాటలు ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ‘ఉయ్యాల జంపాల’తో దర్శకుడిగా పరిచయమైన విరించి వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించటం, మజ్ను మూవీ మార్కెట్‌కి ప్లస్‌గా మారింది.
అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఇప్పటికే మాటివి సంస్థ ఈ మూవీకి సంబంధించిన శాటిలైట్ రైట్స్‌పై బేరం పెట్టిందని అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నానికి టైం కలిసి వచ్చిందని, అందుకే తన మూవీలకి సంబంధించిన బిజినెస్‌లు, రిలీజ్‌కి ముందే టేబుల్ ప్రాఫిట్స్‌తో రిలీజ్ అవుతున్నాయని అంటున్నారు. ఇక మజ్ను మూవీలో హీరోయిన్గా అన్ను ఇమ్మాన్యూల్, ప్రియా శ్రీలు నటిస్తున్నారు.
ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదలచేయనున్నారు. ఇక మజ్ను చిత్రం తరువాత నాని తిరిగి రాజమౌళి దర్శకత్వంలో ఓ చిన్న మూవీలో నటించే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం నాని తన అప్ కమింగ్ మూవీలకి సంబంధించిన కథల విషయంలో ఏ మాత్రం తొందర పడుకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటున్నారు.


