నానితో ఆ కోరిక తీర్చుకుంటుందట!
నాచురల్ స్టార్ నానితో కోరిక తీర్చుకోవాలని ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్న ఓ హీరోయిన్ ఇప్పుడు ఎట్టకేలకు ఆ ఆశ నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. కోరిక అంటే ఏదేదో ఊహించుకునేరు జస్ట్ నానితో ఓ సినిమాలో అయినా నటించాలని ఆశపడ్డ రెజినా ఇప్పుడు తన సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయిందని తెలుస్తుంది. రీసెంట్గా జ్యో అచ్యుతానంద సినిమాలో జస్ట్ చివర్లో కలిసి అలరించిన ఈ జంట ఫుల్ మూవీ చేస్తే చూడాలని ఆడియెన్స్ కూడా ఆశపడుతున్నారు. అటు స్టార్ హీరోయిన్గా స్టార్స్‌తో నటించక పోయినా కుర్ర హీరోల్లో రెజినా క్రేజ్ మాములుగా లేదు. మినిమం బడ్జెట్‌కు పర్ఫెక్ట్ హీరోయిన్గా రెజినా అందరి నుండి మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంది. అయితే ఇన్ని సినిమాలు చేసిన నానితో నటించాలనేది రెజినా కోరికట. అయితే ఆ కోరిక అవసరాల శ్రీనివాస్ తీర్చేస్తున్నాడు. ప్రస్తుతం నేను లోకల్ సినిమాలో నటిస్తున్న నాని ఆ తర్వాత శివశంకర్ అనే కొత్త దర్శకుడితో మూవీ ప్లానింగ్‌లో ఉన్నాడు. ఇక ఆ తర్వాత అవసరల శ్రీనివాస్ డైరక్షన్లో తనే నిర్మాతగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు నాని. అందులో హీరోయిన్గా రెజినాను సెలెక్ట్ చేశారట. నానితో నటించాలని ఆశపడ్డ అమ్మడు ఏకంగా తన నిర్మాణంలోనే అవకాశం అందుకున్నందుకు ఫుల్ హ్యాపీగా ఉంది. ప్రస్తుతం చేతులో ఉన్న సినిమాలన్ని క్రేజీ ప్రాజెక్ట్ అవడంతో అమ్మడు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మరి నాని, రెజినా ఈ ఇద్దరు రేర్ కాంబోలో వస్తున్న సినిమా ఏవిధంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. ఈ సంవత్సరం ఇప్పటికే మూడు సినిమాల రిలీజ్‌తో మూడు హిట్లు అందుకున్న నాని డిసెంబర్లోనే నేను లోకల్ సినిమాను రిలీజ్ చేస్తారని అంటున్నారు. అది కూడా హిట్ అయితే నాని ఓ అరుదైన రికార్డ్ సృష్టించిన వాడవతాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కోసం కీర్తి సురేష్ వెయిట్ చేయడం ఏంటి అంటే ఈ హాట్ సమ్మర్లో మరింత హాటెస్ట్ హిట్ అందుకున్న సరైనోడు అల్లు అర్జున్ ప్రస్తుతం దువ్వాడ జగన్నాథంగా రాబోతున్నాడు. ముహుర్తం పెట్టి త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయనున్న ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ సెలెక్ట్ అయ్యింది. కేవలం నటన ప్రాధాన్యత కల సినిమాలను చేస్తూ కీర్తి ఓ రేంజ్ పాపులారిటీ తెచ్చుకుంది. అయితే బన్ని సినిమా ఛాన్స్ రాగానే ఎగిరి గంతేసిన అమ్మడు ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనే ఎక్సయిటింగ్లో ఉందట. బన్నికి జోడిగా అనగానే మారు మాట మాట్లాడకుండా ఓకే చెప్పిన కీర్తి తన సినిమాలో చేస్తున్నందుకు ఫుల్ హ్యాపీగా ఉంది. ఇక షూటింగ్ త్వరలో స్టార్ట్ చేయబోతున్న ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది అమ్మడు. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ సినిమా హిట్‌తో యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. కోలీవుడ్‌లో కూడా వరుస సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న కీర్తి ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని నేను లోకల్ సినిమాలో నటిస్తుంది. అయితే ఇందులో స్పెషల్ ఏంటంటే నాని సినిమా బన్ని సినిమా నిర్మాత దిల్ రాజు కావడం విశేషం. పరిశ్రమలో ఏ కొత్త హీరో అయినా హీరోయిన్ అయినా ఎదుగుతుంటే వారికి ఎంకరేజ్ ఇస్తూ వారి ద్వారా తన సినిమాలను హిట్ చేసుకోవడం దిల్ రాజుకి ఎప్పటి నుండో అలవాటే. సో మరి కీర్తి చేస్తున్న ఈ నిరీక్షణ ఎప్పుడు తీరుతుందో చూడాలి. ఇక సినిమా కూడా బన్ని మార్క్ ఎంటర్టైనర్గా ఓ రేంజ్ హిట్ అవ్వాలని ఆశిద్దాం.


