నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల
- 68 Views
- wadminw
- December 15, 2016
- రాష్ట్రీయం
నిజామాబాద్, డిసెంబర్ 14 (న్యూస్‌టైమ్): వేసగి పంటలను ఆదుకునేందుకు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతషిండే ప్రాజెక్టు ప్రధాన గేటు నుండి నీటిని కాల్వకు విడుదల చేశారు. ముందుగా జరిపిన పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు ఆయకట్టు కింద గల లక్షా 20 వేల ఎకరాలకు ఐదు అంచలుగా నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికను రూపొందించడం జరిగిందని చెప్పారు. జనవరి నెలాఖరు వరకు నీటిని విడుదల చేస్తామని అన్నారు.
మూడు సంవత్సరాలుగా వర్షాభావంతో తల్లడిలిపోరున రైతులకు సమస్యల కొంత తీరుతుందని అన్నారు. సాగర్ నీటి మట్టం పూర్తిస్థారు 17 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 17.3 టీఎంసీలు నిల్వ ఉందని చెప్పారు. వేసవి పంటలకు ప్రాజెక్టు నుండి 11 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని షిండే తెలిపారు. ఖరీఫ్‌లో నీటిని విడుదల చేసి రైతులను ఆదుకుంటామని అన్నారు. అవసరమైతే ప్రాజెక్టుకు ఎగువన నిర్మించిన సింగూర్ రిజర్వాయర్ నుండి ఎనిమిది టీఎంసీల నీటిని వినియోగించుకునే హక్కు జిల్లా ప్రజలకు ఉందని ఆయన అన్నారు. దీంతో ఇటు, అటు సాగు నీటి సమస్య పరిష్కారమవుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రాజు, అధికారులు పాల్గొన్నారు.


