నిరాశ్రయుల వసతిగృహాల నిర్వహణపై శ్రద్ధ: కమిషనర్
విశాఖ నగరంలోని, నగరానికి వచ్చే నిరాశ్రయులకు నిర్వహించే వసతి గృహాలను సమర్దవంతంగా నిర్వహించేలా చూడాలని జివియంసి కమీషనర్ హరినారాయణన్ ఆదేశించారు. నగరంలో జివియంసి, ఏఆర్టిడి స్వచ్ఛంధ సంస్ధలు సంయుక్తంగా భీంనగర్, టియస్ఆర్ కాంప్లెక్స్, భూపేష్‌నగర్, జిల్లాపరిషత్రోడ్, ఎన్ఏడిలలో నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతి గృహాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా నిరాశ్రయులతో మాట్లాడి కష్టసుఖాలు తెలుసుకున్నారు. వసతి గృహలలో నిర్మించిన మరుగుదొడ్లు, లైటింగ్ మెరుగుపరచాలని సూచించారు. నిరాశ్రయులకు మంచాలు, త్రాగునీటికి వాటర్‌ఫిల్టర్స్ ఏర్పాటుచేయాలని సూచించారు. పైపుల లీకేజీ, మరుగుదొడ్ల మరమ్మత్తులు నిర్వహించాలని ఇ.ఇ. మహేష్‌ను ఆదేశించారు. కమీషనర్ వెంట యుసిడి పిడి డి.శ్రీనివాసన్, జోనల్ కమీషనర్ వి.చక్రధరరావు, ఇ.ఇ.మహేష్, ఏపిడి నాగమణి, ఏసిపి సత్యనారాయణ తదితరులు పర్యటనలో పాల్గొన్నారు.


