నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటాం: కలెక్టర్
- 179 Views
- wadminw
- September 3, 2016
- రాష్ట్రీయం
ఆదిలాబాద్: జిల్లాలో రెండవ విడతగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 3.84 కోట్ల మొక్కలను నాటినట్లు జిల్లా కలెక్టర్ జగన్మోహన్ పేర్కొన్నారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ ఈ మేరకు తెలిపారు. జిల్లాలోని 866 గ్రామ పంచాయితీలకు గాను 485 గ్రామ పంచాయితీల్లో నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించామని ఆయన తెలిపారు.
జిల్లాలో నాటిన మొక్కల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాను హరితహారంగా చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. రెండవ విడతగా జిల్లావ్యాప్తంగా నాలుగు కోట్ల మొక్కలను నాటాల్సిందిగా లక్ష్యంగా పెట్టుకున్నామని, త్వరలో ఈ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. మొక్కల రక్షణలో ప్రతిఒక్కరు బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు.


