నూతన అంశాలను నేర్చుకునే ఉత్సుకత చూపాలి: ఏయూ రిజిస్ట్రార్
- 76 Views
- wadminw
- October 26, 2016
- రాష్ట్రీయం
విశాఖపట్నం, అక్టోబర్ 26 (న్యూస్టైమ్): నూతన అంశాలను, శాస్త్ర విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలనే ఉత్సుకతతో పనిచేయాలని ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వర రావు అన్నారు. బుధవారం సాయంత్రం ఏయూ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ సమావేశమందిరంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు ‘రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ స్ట్రక్చరల్ హెల్త్ మానిటరింగ్’ అంశంపై నిర్వహించిన సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాంత్రీకరణ తన ప్రాధాన్యాన్ని కలిగి ఉందన్నారు. అభ్యశించిన శాస్త్రంలో తమ వృత్తిని కొనసాగించాలన్నారు.రానున్న కాలంలో ఇటువంటి శాస్త్ర అంశాలలో నిపుణుల కొరత నివారించే దిశగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సదస్సులలో నిపుణుల ప్రసంగాలు, నూతన శాస్త్ర విజ్ఞానాన్ని అందిస్తాయన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.ఎస్ అవధాని మాట్లాడుతూ జీవ, శరీర ధర్మాలు యంత్రాల పనితీరును నిర్వహించే విధానాలలో వినియోగించడం జరుగుతోందన్నారు. విభాగాధిపతి ఆచార్య ఎం.ప్రమీల దేవి మాట్లాడుతూ యంత్రాల పనితీరును నిరంతరం గమనించాలన్నారు. నూతన జ్ఞానాన్ని పొందాలని సూచించారు. ప్రతినిధులు తమ జ్ఞానాన్ని వృద్ది చేసుకోవాడానికి ప్రయత్నించాలన్నారు. సదస్సు కన్వీనర్ ఆచార్య పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ నష్ట నివారణ చర్యలు, లోపాలను గుర్తించడంలో సాంకేతికతిక వినియోగించడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో విభాగ ఆచార్యులు సి.హెచ్ రత్నం, శ్రీనివాస కిషోర్, పి.వి రావు, ఎం.మధు సూధన్, పడాల్ తదితరులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పరిశోధకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సదస్సులో పాల్గొన్న ప్రతినిధులకు సర్టిఫీకేట్లను ప్రధానం చేశారు.


