నేడు దసరా మహోత్సవాలకు శ్రీకారం
కర్నూలు, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): శ్రీశైల మహాక్షేత్రం దసరా మహోత్సవాలకు ముస్తాబైంది. ఆలయంలో ఉత్సవమండపాన్ని పుష్పాలతో అలంకరించనున్నారు. శనివారం ఉదయం 9.15 గంటలకు ఈవో ఎన్.భరత్‌గుప్తా అమ్మవారి ఆలయ యాగశాల ప్రవేశం చేసి శాస్త్రోక్తంగా గణపతిపూజ, స్వస్తి పుణ్యాహవాచనం, దీక్షా సంకల్పం, కంకణపూజ, అఖండస్థాపన, వాస్తుపూజ, మండపారాధనలు, చండీకలశస్థాపన, ఋత్విగ్వరణం వంటి క్రతువులు చేపట్టనున్నారు. 9.45 గంటలకు శ్రీస్వామివారి ఆలయ యాగశాల ప్రవేశం, శివసంకల్పం, గణపతిపూజ, అఖండస్థాపన, వాస్తుపూజ, మండపారాధన, రుద్రకలశస్థాపన, స్వామివారి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతాయన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి సాయంకాలపూజలు, పారాయణలు, జపానుష్ఠానాలు, అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన, నవావరణార్చన, కుంకుమార్చనలు, 5 గంటలకు రుద్రహోమం, చండీహోమాలు జరుగుతాయన్నారు.రాత్రి9 గంటలకు సువాసినీపూజ, కాళరాత్రి పూజ, నీరాజన మంత్రపుష్పములు జరుగనుంది. సాయంత్రం శ్రీభ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయ ప్రాంగణంలోని వేదికపై శైలపుత్రిదేవికి అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో విశేషపూజలు నిర్వహిస్తారు. అలంకారమండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూజలు జరుపుతారు. మంగళవాయిద్యాలు,సాంస్కృతిక సందడి నడుమ ఉత్సవమూర్తులను ఆలయం నుంచి వెలుపలికి తీసుకొస్తారు. గంగాధరమండపం నుంచి నందిమండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం జరుగనుంది.
జాతీయ పోటీలకు జిల్లా క్రీడాకారులు
కర్నూలు, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 4, 5వ తేదీల్లో జరిగే 28వ సౌత్‌జోన్ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి హర్షవర్దన్, సహాయ కార్యదర్శి లక్ష్మయ్య తెలిపారు. ఎం. సాగర్ 100 మీటర్స్ (మున్సిపల్ స్కూల్ ఆదోని), బి. నాగరజిత హైజంప్ (కర్నూలు), మధుకావ్య రెడ్డి 100 మీటర్స్ (శ్రీచైతన్య స్కూల్ కర్నూలు), అక్షిత 100, 200 మీటర్స్, స్టెప్ జంప్ (కర్నూలు), మనీషా లాంగ్‌జంప్, 200 మీటర్స్ (ఏపీ మోడల్ స్కూల్ క్రిష్ణగిరి), కె. శివ 300 మీటర్స్, ఎన్ సాయిక్రిష్ణ 110 మీటర్స్ హర్డిల్స్ (ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కర్నూలు), కె నరేష్ 100 మీటర్స్ (బాలశివ కాలేజ్ కర్నూలు), కిశోర్ 5000 మీటర్స్ వాక్ (ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నంద్యాల). కాగా, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్ ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో జిల్లా కేంద్రం నుంచి జేసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను శనివారం మధ్యాహ్నం నగరపాలక సంస్థలు, గ్రామపంచాయతీలు, పురపాలక సంస్థల పరిధిలో తప్పక నిర్వహించాలన్నారు. ముఖ్యకూడళ్లలో ర్యాలీలు నిర్వహించి, పేదలుండే కాలనీల్లో పెద్ద ఎత్తున ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా వనం–మనం కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమం, వాటి సంరక్షణ, ట్రీగార్డుల ఏర్పాటు చేపట్టాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థల నుంచి విద్యార్థులను బందాలుగా ఏర్పాటు చేశామని చెప్పారు. మొత్తం 55వేల బందాలు ఉండగా, ఒక్కో బందానికి 10 ఇళ్లను కేటాయించి, వారి ద్వారా సదరు కుటుంబాల్లో వ్యాధులు రాకుండా చేపట్టాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. అందుకు అవసరమైన కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, ఫ్లిప్ క్యాలెండర్లు వైద్య ఆరోగ్యశాఖ సమకూరుస్తుందన్నారు. స్వయం సహాయ సంఘాల మహిళలను ఇందులో భాగస్వామ్యులను చేయాలన్నారు. ప్రతి అధికారి తమ కార్యాలయ పరిసరాల్లో కూడా పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి, సీపీవో ఆనందనాయక్, డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరిబాబు, డీపీవో ఆందన్, నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, డీఆర్డీఏ పీడీ రామకష్ణ తదితరులు పాల్గొన్నారు.
3న కర్నూలులో సైనిక రిక్రూట్మెంటు ర్యాలీ
కర్నూలు, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): సైనిక రిక్రూట్మెంటు ర్యాలీని అక్టోబరు 3వ తేదీన మద్రాసు ఇంజనీరు గ్రూపు, కేంద్రం, బెంగుళూరునందు నిర్వహించడం జరుగుతుందని ఆసక్తిగల మాజీ సైనికుల కుమారులు, మాజీ సైనికులు అవసరమైన ఒరిజినల్ ధృవపత్రాలతో నేరుగా హాజరుకావలసివుంటుందని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి బి. రాచయ్య నేడొక ప్రకటనలోతెలిపారు. ఈ సందర్భంగా రిక్రూట్మెంటు ర్యాలీలో సోల్జర్ జిడి (స్పోర్ట్స్‌మెన్) మరియు సోల్జర్ క్లర్కు/ాఔి క్యాటగిరీలకు నియామకాలు ీnష ఐ|శdసషశసష|స షుషశ క్రింద జరుగనున్నాయని ఆయన తెలిపారు. అభ్యర్థులు తమ సొంత పూచీకత్త్తుతో ర్యాలీకి హాజరుకావలయునన్నారు. అభ్యర్థులు మాజీ సైనికులతో ఉన్న భాందవ్యాలపై సంబంధిత రికార్డు ఆఫీసు వారు జారీ చేసిన ధృవీకరణ పత్రం మరియు ఒరిజినల్ ధృవపత్రాలతో 3-10-2016 వ తేది ఉదయం 5.30 గంటలకు ట్రైనింగ్ బెటాలియన్ ఒఒఒ (మారుతీ సేవానగర్ గేట్) మద్రాసు ఇంజనీరు గ్రూపు మరియు కేంద్రం, బెంగుళూరు నందు రిపోర్టు చేయవలసిందిగా ఆయన వివరించారు. 17-9-2016 నుండి 21-9-2016వరకు నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టుకు హాజరయి అర్హత పొందలేక పోయినవారిని రిక్రూట్మెంట్ ర్యాలీలో అనుమతించరని ఆయన తెలిపారు. ఇతర వివరములకు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి, కర్నూలు వారిని సంప్రదించవలసిందిగా ఆయన ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.


