నోట్లరద్దు దందాతో లోక్‌సభ నేటికి వాయిదా
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: పార్లమెంట్లో యథావిథిగా బుధవారంనాడు కూడా ప్రతిష్టంభన నెలకొంది. లోక్‌సభలో విపక్షాల ఆందోళనలు, నినాదాలతో సభ గురువారంనాటికి వాయిదా పడింది. కేంద్ర మంత్రి చిరణ్్ రిజుజుకు వ్యతిరేకంగా విపక్షాలు నినాదాలు చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో విద్యుత్ ప్రాజెక్టు వ్యవహారంలో చిరణ్కు ప్రమేయం ఉందంటూ విపక్ష సభ్యులు ఆందోలన చేశాయి.
విద్యుత్ ప్రాజెక్టులో ఆయన అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బిల్లుల చెల్లింపులో ఆయన ఒత్తిడి తెచ్చారంటూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగి నినాదాలతో సభను హోరెత్తించారు. సభ్యులను శాంతింప చేసేందుకు స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రయత్నించినప్పటికీ సభ్యులు తమ పట్టు వీడలేదు. దీంతో ఆమె సభను రేపటికి వాయిదా వేశారు. ఇటు రాజ్యసభలోను ఇదే అంశంపై గందరగోళం ఏర్పడింది.
కేంద్ర మంత్రి రిజుజుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు పట్టుబడుతూ సభలో నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి నఖ్వి సమాధానం చెప్పేందుకు ప్రయత్నించిప్పటికీ విపక్ష సభ్యులు వినకుండా ఆందోళన కొనసాగించారు. చైర్మన్ హమీద్ హన్సారీ విపక్ష సభ్యులను శాంతించించాల్సిందిగా పదే పదే విజ్ఞప్తి కనిపించినప్పటికీ ఫలితం కనిపించలేదు. విపక్షాల ఆందోళన నడుమ మధ్యనే చైర్మన్ హన్సారీ రాజ్యసభకు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. కడపి వార్తలు అందేసరికి రాజ్యసభలో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది.


