నోట్ల రద్దుతో ఇబ్బందుల్లో సామాన్య ప్రజలు: కాంగ్రెస్
నోట్ల రద్దుపై ప్రధానమంత్రి మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పట్టణ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లకుభేరులు డబ్బున్నవారు ఎవరూ కూడా బ్యాంకులు, ఎటిఎంల వద్ద క్యూలో నిలబడడం లేదన్నారు. సామాన్య ప్రజల సమస్యను పరిష్కరించటంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయన్నారు.
రూ.500, 1000 నోట్ల రద్దు చేసిన కేంద్రం రూ.2 వేల నోటును ఎందుకు తెచ్చిందో అర్థం కావటం లేదన్నారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్యుల కష్టాలు పరిష్కరించానలి డిమాండ్ చేశారు. ఈ నెల 23న పిసిసి ఆధ్వర్యంలో చలో వెలగపూడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జ్ఞాన్రాజ్పాల్, తదితరులున్నారు.
Categories

Recent Posts

