న్యాయస్థానం అవసరాలకు ఫొటోకాపీయర్ కొనుగోలు
ఏలూరు, అక్టోబబర్ 4 (న్యూస్టైమ్): పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు అవసరాల నిమిత్తం ఫొటోకాపీయర్ మెషిన్లను కొనుగోలుచేయాలని న్యాయాధికారులు నిర్ణయించారు. ఈమేరకు బ్రాండెడ్ కంపెనీ అయిన తోషిబాకు చెందిన ఈ-స్టూడియో 555 మోడల్ నెం. టీ 6000డీ టోనర్స్ 3 నెం., కోనికా మినోల్టా బిజ్హబ్ 215 టోనర్స్ 6 నెం. సరఫరా నిమిత్తం కోటేషన్లు కోరుతున్నట్లు జిల్లా జడ్జి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
సదరు కొటేషన్లను ఈనెల పదిహేనువ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఏలూరు కేంద్రంలోని జిల్లాకోర్టులో అందించాలన్నారు. సదరు కొటేషన్లు విషయమై అన్ని హక్కులు జిల్లా జడ్జి కలిగి ఉంటారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల డీలర్లు పై వస్తువుల సరఫరా చేయడానికి కొటేషన్లు సమర్పించవలసిందిగా కోరారు.
Categories

Recent Posts

